Thu Dec 19 2024 14:12:38 GMT+0000 (Coordinated Universal Time)
AP Crime news : వైసీపీ నేత దారుణ హత్య
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని.. పరిశీలించారు. హత్యకు వాడిన కత్తిని పక్కనున్న
ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన నేతను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషును శ్రీకూర్మం గ్యాస్ గోడౌన్ సమీపంలో దుండగులు కత్తితో నరికి చంపారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని.. పరిశీలించారు. హత్యకు వాడిన కత్తిని పక్కనున్న పొలాల్లో స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మృతుడి ఒంటిపై నున్న బంగారు వస్తువులు, మొబైల్ అలాగే ఉండటంతో.. దొంగలు చేసిన పని కాదని నిర్థారించారు. ఇది వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యగా భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, వివాహేతర సంబంధం కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. రామశేషును ముగ్గురు వ్యక్తులు హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story