Mon Dec 23 2024 03:27:29 GMT+0000 (Coordinated Universal Time)
Apple Iphone 16 Series: ఐఫోన్ 16 సిరీస్ విడుదల.. ఇండియాలో ధరలివే!
యాపిల్ కంపెనీ ఐఫోన్ 16 సిరీస్
యాపిల్ కంపెనీ ఎట్టకేలకు కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసింది. భారతదేశం, ఇతర ప్రపంచ మార్కెట్లలో ఐఫోన్ 16 సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 16 మోడల్స్ లో అనేక అప్‌గ్రేడ్ లు ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో వెర్షన్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఐఫోన్ 16 సిరీస్ కావాలనుకున్న వారు త్వరలో ప్రీ-ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఆపిల్ స్టోర్.. ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అమ్మకాలు జరగనున్నాయి.
ఐఫోన్ 16 ప్రారంభ ధర $799 (దాదాపు రూ. 67,000)తో వస్తుంది. అయితే ఐఫోన్ 16 ప్లస్ ధర $899 (సుమారు రూ. 75,500) గా ఉండనుంది. iPhone 16 Pro ధర 128GBకి $999 (సుమారు రూ. 83,870) తో రానుంది. iPhone 16 Pro Max 256GB కోసం $1199 (సుమారు రూ. 1 లక్ష) లభిస్తుంది. ఇవి అమెరికా మార్కెట్ లో ధరలు.
భారతదేశంలో, ఐఫోన్ 16 ధర రూ. 79,900, ఐఫోన్ 16 ప్లస్ రూ. 89,900 ధరకు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 16 ప్రో భారతదేశంలో ప్రారంభ ధర రూ. 1,19,900 అని తెలుస్తోంది. అత్యంత ప్రీమియం మొబైల్ అయిన ఐఫోన్ 16 Pro Max భారత్ మార్కెట్లో రూ. 1,44900 కు లభిస్తుంది. ఐఫోన్ 16 సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్ సెప్టెంబర్ 13న మొదలవ్వనుంది. భారతదేశంలో సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. మొదటి సేల్ సెప్టెంబర్ 20న జరగనుంది.

Next Story