Fri Dec 20 2024 19:46:36 GMT+0000 (Coordinated Universal Time)
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. అవ్వడం ఎలా? పార్ట్-2
సోషల్ మీడియా సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించడం వల్ల ఇన్ఫ్లుయెన్సర్లకు కొన్ని ప్రమాదాలు
ఇన్ఫ్లుయెన్సర్స్ కు ఉండే రిస్క్‌లు:
సోషల్ మీడియా సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించడం వల్ల ఇన్ఫ్లుయెన్సర్లకు కొన్ని ప్రమాదాలు పెరుగుతాయి. ఇక్కడ విలువైన సమాచారం, గుడ్‌విల్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కొన్ని దశలను అనుసరించడం ద్వారా ఈ ప్రమాదాల బారి నుండి తప్పించుకోవచ్చు. ప్రమాదాన్ని ముందుగా గుర్తించడం, ప్రమాదాన్ని అంచనా వేయడం, ప్రమాదాన్ని తగ్గించడం వంటివి చేయవచ్చు.
అల్గారిథమ్ పై అవగాహన:
ఒక అల్గారిథమ్ నిర్దిష్ట ఫలితాన్ని రూపొందించడానికి కంప్యూటర్‌కు ఏమి చేయాలో చెబుతుంది. ఇది దశల వారీ విధానం. అల్గారిథమ్ లు మన జీవితంలో ఒక భాగమయ్యాయి. ప్రతి ఒక్కటీ ఒక అల్గారిథమ్ లో భాగమయ్యాయి. వారు ఏమి చూస్తారు..? వారు ఏమి చూడరు..? వారు ఎంతసేపు చూస్తారు..? వారు ఎక్కడ చూస్తారు.. వారు చూసినప్పుడు లైక్‌లు, డిస్‌లైక్‌లు, షేర్లు, ప్రీ, పోస్ట్ వాచ్ సర్వేలు మొదలైన వాటిలో ఉంటాయి.
అల్గారిథమ్‌ల పరిణామం క్లిక్‌లు, ఇష్టాలతో కొలవడం ప్రారంభించారు. తర్వాత "వాచ్ టైమ్" ద్వారా కొలుస్తారు. ఇప్పుడు అది "శాటిస్ఫాక్షన్ " ద్వారా కొలుస్తారు. అయితే అల్గారిథమ్‌లను ప్రభావితం చేసే అంశాలు.. వ్యక్తిగతీకరణ, పనితీరు, బాహ్య కారకాలు ఉంటాయి. కంటెంట్ ఎంత రిలేటెడ్ గా ఉంది..? సగటు వాచ్ టైమ్..? మీరు వీడియో ఎంతకాలం ఉంచుతారు..? అనేది ఆధారపడి ఉంటుంది.
ఎవరికి ఎలా వర్తిస్తాయి:
సెలబ్రిటీలు పలు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్లకు ఉన్న జ్ఞానం, ఏ స్థాయిలో ఉన్నారు.. తమ ఫాలోవర్లతో ఉండే పరిచయాలు వంటి విషయాలపై కూడా దృష్టి పెట్టాలి. ఫాలోవర్లు, సాధారణ ప్రజలు కొన్ని ఉత్పత్తుల విషయంలో సెలెబ్రిటీలను నమ్మేస్తూ ఉంటారు. సెలెబ్రిటీలు కొన్ని సమూహాలను ప్రభావితం చేయగలరు. కొందరు ప్రముఖ వ్యక్తులు, వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా ఉంటారు. కొన్ని విషయాలలో బలమైన ముద్ర వేయగలరు. ఉత్పత్తులు, సేవలను అందించే, తెలియజేసే వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు. కంప్యూటర్ ద్వారా సృష్టించిన 'వ్యక్తులు' లేదా 'అవతార్'లు వాస్తవిక లక్షణాలు, వ్యక్తిత్వాలను కలిగి ఉంటాయి. అలాగే ప్రభావశీలులగా ప్రవర్తిస్తాయి.
సెలబ్రిటీ, ఇన్ఫ్లుయెన్సర్ మధ్య మెటీరియల్ కనెక్షన్ ఉన్నప్పుడు, అది ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేసిన వస్తువు విశ్వసనీయతను ప్రభావితం చేయవచ్చు. మెటీరియల్ కనెక్షన్లో ద్రవ్య లేదా ఇతర పరిహారం వంటి ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు అందుకోవడం వరకు మాత్రమే పరిమితం కాదు. డిస్కౌంట్లు, బహుమతులు, పోటీ, స్వీప్స్టేక్ల ఎంట్రీలు, పర్యటనలు లేదా హోటల్ స్టే సహా ఎన్నో విషయాలు ఉంటాయి. ఉచితంగా మీకంటూ కొన్ని ఉత్పత్తులను ఇవ్వడం, కవరేజ్, అవార్డులు ఇవ్వడం, లేదా మీకు తెలిసిన వ్యక్తులకు సంబంధించి ఉండడం లాంటివి కూడా ఉంటాయి. ప్రకటనల విషయంలో స్పష్టంగా, ఎండార్స్మెంట్ చేస్తున్నామని తెలిపే విధంగా ఉంచాలి. హ్యాష్‌ట్యాగ్‌లు లేదా లింక్‌ల ద్వారా బహిర్గతం చేయకూడదు. ఎండార్స్మెంట్, ప్రకటనల విషయంలో వీక్షకులు గమనించే విధంగా ఆ ఇమేజ్‌పై సూపర్మోస్ చేయాలి. వీడియోలో ఎండార్స్మెంట్, డిస్క్లోజర్లను వీడియోలో ఉంచాలి.. వివరణలో మాత్రమే ఉండేలా చూసుకోకండి. ప్రకటనలు ఆడియో, వీడియో ఫార్మాట్లో చేయాలి.
సింపుల్ అండ్ క్లియర్ లాంగ్వేజ్ వాడాలి. Twitter వంటి పరిమిత స్పేస్ ప్లాట్‌ఫారమ్‌లలో, 'XYZAmbassador' వంటి నిబంధనలు కూడా ఆమోదయోగ్యమైనవి. ‘ప్రకటన’ ‘పెయిడ్ ప్రమోషన్’ 'స్పాన్సర్డ్' లాంటివి ఒకే భాషలో ఉండాలి. సెలబ్రిటీలు ఎల్లప్పుడూ ఏయే ప్రాడక్టులకు మద్దతు ఇస్తున్నామో సమీక్షించుకోవాలి. ఉత్పత్తి, సేవ తప్పనిసరిగా ఎండోర్సర్ ద్వారా ఉపయోగించినట్లు ఉంటే కూడా సిఫార్సు చేయాలి.
డ్యూ డిలిజెన్స్:
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు.. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను సంప్రదించి వారి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి వాడుకుంటూ ఉంటాయి. ఈ కామర్స్ సంస్థ వారిని నిర్దిష్ట బ్రాండ్ల దుస్తులను ధరించమని.. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం కంటెంట్‌ను రూపొందించమని కోరుతూ ఉంటారు. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఆన్లైన్లో కంటెంట్‌ను పోస్ట్ చేస్తారు. వారిలో ఎక్కువ మంది ఇ-కామర్స్ సంస్థలతో ఉండే తమ మెటీరియల్ కనెక్షన్‌ను బహిర్గతం చేయరు. కొందరు సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆ బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించింది. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు తమ మెటీరియల్ కనెక్షన్‌ను బహిర్గతం చేయనట్లయితే, వారి అభిప్రాయం పక్షపాతంగా తప్పుదారి పట్టించేదని భావించవచ్చు. అయితే, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తున్నామని తెలియజేస్తే మాత్రం వినియోగదారులు సరైన నిర్ణయం తీసుకోగలరు. ఇలాంటి విషయాలలో వినియోగదారులు కొన్ని సంస్థలకు ఫిర్యాదు చేస్తే అధికారులు కఠిన చర్యలను తీసుకునే అవకాశం కూడా ఉంది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కోసం చిట్కాలు:
స్టాకింగ్.. ఎప్పుడూ మీ ఫోన్ నంబర్ లేదా చిరునామాను మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో ప్రచురించవద్దు. చాలా వరకూ వాణిజ్యపరమైన ఉపయోగాల కోసం సేకరిస్తారు. ఇతర అవసరాలకు ఉపయోగించే అవకాశం ఉంది. యాప్‌లకు ఇచ్చిన యాక్సెస్ లను కూడా తనిఖీ చేయండి. కనెక్ట్ చేసిన యాప్‌లు, ఫాలోవర్స్ ను కూడా పరిశీలించండి. అనవసరమైన వాటిని తొలగించండి. ప్రైవసీ సెట్టింగ్‌ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. మీ ఫోన్లో మీ GPS, బ్లూటూత్ లాంటి వాటికి పాస్ వర్డ్ ను సెట్ చేయండి. విశ్వసనీయ ప్రొవైడర్ల నుండి మాత్రమే డేటాను డౌన్లోడ్ చేసుకోండి. అన్ని ఆఫ్‌లైన్, ఆన్లైన్ చర్యల కోసం చాలా విషయాలను పరిగణించాలి. మీ వ్యక్తిగత జీవితాన్ని సురక్షితంగా ఉంచడానికి, ఇది ముఖ్యమైనది. మీ సోషల్ మీడియా పోస్ట్ లపైనా, అభిప్రాయాల వ్యక్తీకరణల పైనా, మీరు వేసుకునే బట్టల పైన కూడా ట్రోల్ చేసే అవకాశం ఉంది. మీ అన్ని పోస్ట్‌లపై వాటర్‌మార్క్‌లను ఉపయోగించండి. లిమిట్స్ ను సెట్ చేసుకోండి. మీరు మీ గురించి, ఇతరుల గోప్యత గురించి కూడా ఆలోచించాలి. భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తిగత విషయాలకు సంబంధించి కూడా ఆలోచించండి. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్ట్ చేయవద్దు. జాత్యహంకార, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలు లేకుండా చూసుకోండి. మాల్వేర్, ట్రాకర్ల లాంటివి లేని పేమెంట్ ఆప్షన్స్ ను ఉపయోగించండి. పాస్వర్డ్లు, ఇమెయిల్, పేమెంట్స్ ను కాపాడడానికి 2FA విధానాన్ని ఉపయోగించండి.
Stay tuned to the Cyber Samacharam Column contributed by Anil Rachamalla from the End Now Foundation.
Next Story