Fri Nov 22 2024 23:43:27 GMT+0000 (Coordinated Universal Time)
మీ గూగుల్ అకౌంట్ డిలీట్ అయిపోయే అవకాశం ఉందేమో.. జర జాగ్రత్త
గూగుల్ అకౌంట్స్.. మన ప్రొఫెషన్ లైఫ్ లోనూ, పర్సనల్ లైఫ్ లోనూ చాలా వినియోగిస్తూ ఉంటాం
గూగుల్ అకౌంట్స్.. మన ప్రొఫెషన్ లైఫ్ లోనూ, పర్సనల్ లైఫ్ లోనూ చాలా వినియోగిస్తూ ఉంటాం. అలాంటి మీ గూగుల్ అకౌంట్స్ డిలీట్ అయ్యే అవకాశం ఉంది. మిమ్మల్ని, మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి Google తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా మీ వ్యక్తిగత డేటాను, వాటితో అనుసంధానించిన ఏదైనా డేటాను చాలా కాలం గూగుల్ లో నిల్వ చేసుకోవచ్చు. బలమైన గోప్యతా పద్ధతులను కూడా గూగుల్ కలిగి ఉంది. అయితే మీరు మీ గూగుల్ అకౌంట్‌ను కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు మీ గూగుల్ అకౌంట్ ను అసలు వాడకపోయినా.. రెండేళ్లుగా లాగిన్ అవ్వకపోయినా.. ఆ అకౌంట్ శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. ఇందుకు సంబంధించి కొత్త పాలసీని 2023 డిసెంబర్ 1 నుంచి గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ గూగుల్ తన యూజర్లందరికీ మెయిల్స్ పంపింది.
తాను అందించే అన్ని సర్వీసులకు, ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. అకౌంట్‌ను వాడటం మానేసినా వారి డేటా పూర్తిగా గోప్యంగా, సురక్షితంగా ఉండేలా చూడటమే తమ లక్ష్యమని.. అకౌంట్ డిలీషన్ అందులో భాగమేనని గూగుల్ ప్రకటించింది. ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఏదైనా Google ఖాతాకు వర్తిస్తుంది, రెండేళ్ల వ్యవధిలో సైన్ ఇన్ చేయలేదని తెలిస్తే మాత్రం తప్పకుండా డిలీట్ అయిపోతుంది. సేఫ్టీ, సెక్యూరిటీ కారణాల రీత్యా తన పాలసీని ఇలా అప్డేట్ చేస్తున్నట్టు గూగుల్ తెలిపింది. అయితే అకౌంట్‌ను డిలీట్ చేసే ముందు గూగుల్ పలుమార్లు రిమైండర్ మెయిల్స్ పంపుతుంది. అవి సదరు అకౌంట్‌తో పాటు యూజర్ తాలూకు రికవరీ అకౌంట్‌కు కూడా వెళ్తాయి. ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు నుంచే ఈ మెయిల్స్ పంపుతామని తెలిపింది గూగుల్.
Next Story