Sun Dec 22 2024 17:22:36 GMT+0000 (Coordinated Universal Time)
Google AI Courses: ఏఐ గురించి కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారా?
ప్రస్తుతం టెక్నాలజీపరంగా ఏఐ గురించి ఎంతగానో చర్చ జరుగుతూ ఉంది
Google AI Courses:ప్రస్తుతం టెక్నాలజీపరంగా ఏఐ గురించి ఎంతగానో చర్చ జరుగుతూ ఉంది. ఉద్యోగాలు కావాలన్నా కూడా ఏఐనే నమ్ముకుంటూ ఉన్నారు. గూగుల్ సంస్థ కూడా కొన్ని కోర్స్ లను ప్రవేశపెట్టింది. Google క్లౌడ్ స్కిల్స్ బూస్ట్‌లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్లు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కోసం రూపొందించిన పలు కోర్సులు ఉన్నాయి.'లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్' (LLMs) గురించి కూడా ఈ కోర్సుల్లో చెబుతారు. ఈ ఎల్‌ఎల్‌ఎమ్స్ ఉపయోగం ఏమిటి? ఎలా ఉపయోగించాలి అనే విషయమై కూడా నేర్పిస్తారు. ఈ కోర్స్ ద్వారా జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, రెస్పాన్సిబుల్ ఏఐ టెక్నాలజీలను సులువుగా నేర్చుకోవచ్చు. ఈ కోర్సులో థియరీతో పాటు ఇమేజ్ జనరేషన్ గురించి కూడా నేర్పిస్తారు. వెర్టెక్స్ ఏఐ ట్రైనింగ్, డిప్లాయిమెంట్ గురించి కూడా వివరిస్తారు.
ప్రతి లర్నింగ్ పాత్ లో వీడియో కోర్సులు, నైపుణ్యాలకు సంబంధించిన బ్యాడ్జ్‌లను సంపాదించే అవకాశాలతో పలు అంశాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా కొత్త టాపిక్ లను గూగుల్ అందిస్తూ ఉంటుంది. AIలో నైపుణ్యం సంపాదించాలని చూస్తున్న వారు వెంటనే Google క్లౌడ్ లో స్కిల్స్ బూస్ట్ ప్లాట్‌ఫారమ్ ను ప్రారంభించవచ్చు. అభివృద్ధి చెందుతున్న ఫీల్డ్‌కు అనుగుణంగా Google తన శిక్షణా జాబితాను విస్తరిస్తూ ఉంది.
Next Story