Fri Nov 22 2024 14:56:33 GMT+0000 (Coordinated Universal Time)
ఇన్స్టాగ్రామ్ పని చేయలేదే.. ఏంటీ పరిస్థితి
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు మంగళవారం సాయంత్రం భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలలో నిలిచిపోయాయి. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లలో లాగ్ ఇన్ సమస్యల గురించి వినియోగదారులు ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. Facebook, Instagram రెండింటి నుండి లాగ్ అవుట్ అవుతున్నామని.. కొందరు ఇన్స్టాగ్రామ్ పేజీలను కనీసం రిఫ్రెష్ చేసుకోలేకపోయామని తెలిపారు. చాలా మంది వినియోగదారులు పాస్‌వర్డ్‌లను మార్చుకుని మరీ యాక్సెస్ చేయాలని ప్రయత్నించినా ఏ మాత్రం ఫలితం లేకపోయింది.
ఔట్టేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ Downdetector.com కూడా మంగళవారం కొన్ని వేల మంది వినియోగదారులు మెటా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్లో ఉన్నాయని తెలిపారని వివరించింది. Facebook కు సంబంధించి 300,000 కంటే ఎక్కువ అంతరాయాలకు సంబంధించిన నివేదికలు ఉన్నాయి. Instagram కూడా పని చేయలేదని పలువురు ఫిర్యాదులు చేసినట్లు తెలిపింది. దీనిపై మెటా ఇంకా స్పందించాల్సి ఉంది.
Next Story