Mon Dec 23 2024 03:28:51 GMT+0000 (Coordinated Universal Time)
అలా డౌన్ అయ్యాయి.. ఇలా వేల కోట్లు కోల్పోయాడు
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఒక్కరోజులో భారీగా నష్టాన్ని చూశారు
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఒక్కరోజులో భారీగా నష్టాన్ని చూశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొన్న తర్వాత ఒక రోజులో దాదాపు $3బిలియన్లను కోల్పోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో జుకర్‌బర్గ్ నికర విలువ ఒక రోజులో $2.79 బిలియన్లు తగ్గి $176 బిలియన్లకు చేరుకుంది. అయితే అతను ప్రపంచంలోని నాలుగో ధనవంతుడుగా తన స్థానంలో ఉన్నారు. గంట సేపు గ్లోబల్ అవుట్డేజ్ తర్వాత.. మెటా షేర్లు 1.6 శాతం క్షీణించాయి, ఇది మార్క్ జుకర్‌బర్గ్ కు భారీ నష్టానికి కారణమైంది. మెటా షేర్లు వాల్ స్ట్రీట్‌లో ఓవర్‌నైట్ ట్రేడింగ్ సెషన్‌ను ఒక్కొక్కటి $490.22 వద్ద ముగించాయి.దాదాపు 3 బిలియన్ లు అంటే సుమారు రూ.24,741కోట్ల నష్టం.
Facebook, Instagram, థ్రెడ్‌ల వినియోగదారులు మంగళవారం రాత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక మెటా క్వెస్ట్ వినియోగదారులు తమ హెడ్సెట్లకు లాగిన్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తించారు. అన్ని అప్లికేషన్లు మునుపటి స్థాయిలోకి రావడానికి దాదాపు ఒక గంట పాటు అంతరాయం కొనసాగింది.
Next Story