Fri Nov 22 2024 23:33:33 GMT+0000 (Coordinated Universal Time)
Social Media Influencers:ప్రజలు మోసపోడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కారణమేనా?
ప్రమోషన్స్ చేయండి మీకు ఇంత డబ్బు ఇస్తామంటూ.. సందేశాల ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లకు ఆఫర్ లు
Social Media Influencers:ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను తెగ వాడేస్తూ ఉన్నారు. అలా చూస్తూ.. చూస్తూనే నిమిషాలు.. గంటలు గడిచిపోతూ ఉన్నాయి. ఇక వీధికి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చారు. అయితే వీళ్లకు కాస్త డబ్బులను ఆశ చూపించి కొన్ని ఫేక్ వెబ్ సైట్స్ ప్రమోషన్స్ చేయించుకుంటూ ఉన్నాయి. మనకు తెలిసిన వ్యక్తే కదా చెబుతోంది.. నిజమేనేమో అని చాలా మంది ఆ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిన సైట్స్, యాప్స్ లో లాగిన్ అవుతూ ఉన్నారు. కొందరు జూదానికి బానిసలై డబ్బులు పోగొట్టుకుంటూ ఉండగా.. మరికొందరేమో ఫేక్ వెబ్ సైట్స్ లో తమ బ్యాంకు డీటైల్స్ ఇచ్చి అకౌంట్లలోని డబ్బును కోల్పోతూ ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) 4రాబెట్, విన్బజ్, స్పిన్మ్యాచ్ వంటి సైట్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ సైట్స్ వినియోగదారులను డబ్బు పెట్టేలా చేయించి.. మోసం చేస్తూ ఉన్నాయి. గతేడాది సైబర్ నేరాల వల్ల రూ.700 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరగవచ్చని సైబర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు నకిలీ వెబ్సైట్లు, యాప్‌లను ప్రోత్సహిస్తున్నారని. ఇది వినియోగదారుల ఆర్థికపరమైన నష్టాలకు కారణమవుతూ ఉందని తెలిపారు. డబ్బులు కోల్పోయామన్న బాధలో మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు.. వ్యాపారం, బెట్టింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రచారం చేయడానికి డబ్బులను తీసుకుంటూ ఉన్నారు.
ప్రమోషన్స్ చేయండి మీకు ఇంత డబ్బు ఇస్తామంటూ.. సందేశాల ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లకు ఆఫర్ లు వస్తూ ఉంటాయి. వ్యూస్ లేదా పోస్టింగ్‌ల ఆధారంగా చెల్లింపులు మారుతూ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్సర్లు ఒక్కో పోస్ట్‌కు తక్కువలో తక్కువ రూ. 1,000 సంపాదిస్తారు. ఫాలోవర్లు ఎక్కువ ఉన్న వాళ్లకు వచ్చే డబ్బులు బాగా ఎక్కువగానే ఉంటాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా ఖాతాలలో ట్రేడింగ్ ప్రకటనలపై అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు. కొందరిని పోలీసులు సంప్రదించి ఆ లింక్ లు, ప్రమోషనల్ కంటెంట్ ను డిలీట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు.
Next Story