Mon Dec 23 2024 20:31:56 GMT+0000 (Coordinated Universal Time)
APRIL 10 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక వెసులుబాటును కలిగి ఉంటారు.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శనివారం
తిథి : బ.చవితి ఉ.8.37 వరకు
నక్షత్రం : అనురాధ మ.1.58 వరకు
వర్జ్యం : రా. 7.04 నుండి 8.38 వరకు
దుర్ముహూర్తం : మ.12.33 నుండి 1.22 వరకు, మ.3.00 నుండి 3.50 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : మ.12.10 నుండి 1.10 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అష్టమంలో చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అంచనాలు నెరవేరే అవకాశాలు తక్కువ. తెలియని భయం ఉంటుంది. ఇంటర్వ్యూల్లో జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. చాలాకాలం తర్వాత ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక, విద్య, ఉద్యోగం, వ్యాపార పరంగా పెద్దగా ఇబ్బందులుండవు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా సర్దుబాట్లు చేసుకుంటారు. లౌక్యంతో ముందుకి వెళ్తారు. రహస్య శత్రువులను కనిపెడతారు. ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నాలు ఫలిస్తాయి. పనివేళలు పెరిగినా అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రోజంతా అంచనాల మేరకు ఉంటుంది. ప్రశాంతతకు ప్రాముఖ్యతనిస్తారు. వ్యాపారస్తులు నష్టం లేకుండా ఉంటే చాలనుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడవచ్చు. వీలైనంత తక్కువ మాట్లాడటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. పనులు వాయిదా పడుతుంటాయి. ప్రతి పనిలోనూ రెండు ప్లాన్లు వేసుకోవడం మంచిది. మీ అంచనాల మేరకు పనులు జరగవు. ఎదుటివారు మీ అంచనాలకు అందరు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక వెసులుబాటును కలిగి ఉంటారు. కాంట్రాక్ట్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ లోని బిల్లులను క్లియర్ చేసుకునేందుకు మంచికాలం. ఎవరిని పడితే వారిని నమ్మితే మోసపోయే అవకాశాలు ఎక్కువ. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. వీలైనంత తక్కువగా మాట్లాడటం మంచిది. గోప్యంగా చేసే పనులు సక్సెస్ అవుతాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ముందుగా తీసుకున్న నిర్ణయాలు అమలు అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. కొన్నివిషయాల్లో మొండిగా వ్యవహరిస్తారు. వివాదాలను పరిష్కరించుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వ్యయంలో చంద్రుడి సంచారం ఉంటుంది. అతికష్టం పై పనులు చేయాల్సి వస్తుంది. గురుబలం తక్కువగా ఉండటంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతనం తగదు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నింటా విజయం కలుగుతుంది. సహకరించే గ్రహాల సంఖ్య అధికంగా ఉంటుంది. తీరని సమస్యలపై దృష్టి సారిస్తే పరిష్కారమవుతాయి. మనసుకు ఊరటకలిగే పరిణామాలుంటాయి. శుభవార్తలు వింటారు. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మెరుగైన ఫలితాలుంటాయి. ఆర్థికంగా సానుకూల ఫలితాలుంటాయి. ఆగిపోయిన పనుల్లో కదలికలు ఏర్పడుతాయి. రిజిస్ట్రేషన్లపై దృష్టిసారించేందుకు, లోన్ల సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. గౌరవ, మర్యాదలు సమానంగా ఉంటాయి. గడిచిన రెండ్రోజులకంటే ఈరోజు మంచికాలం. ప్రేమలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఊపిరి పీల్చుకోలేని విధంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
Next Story