Mon Dec 23 2024 19:42:07 GMT+0000 (Coordinated Universal Time)
APRIL 12 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. బయటికన్నా ఇంట్లో ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో మాట..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బుధవారం
తిథి : బ.సప్తమి తె.3.44 వరకు
నక్షత్రం : మూల ఉ.11.57 వరకు
వర్జ్యం : ఉ.10.25 నుండి 11.57 వరకు, రా.9.03 నుండి 10.34 వరకు
దుర్ముహూర్తం : మ.11.43 నుండి 12.32 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.10 నుండి 10.00 వరకు, సా.4.10 నుండి సా.5.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం లభిస్తుంది. ఎదుటివారితో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం పరంగా ఊరట కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడటం అవసరం. మీకు తెలియకుండానే మాట ఫోర్స్ గా రావొచ్చు. మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మంచిది కాదు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారస్తులు రొటేషన్లలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అప్పులు తీర్చేందుకు అనుకూలం. ఎదుటివారిని సహాయం అడిగేందుకు అనుకూలమైన కాలం. పార్ట్ టైమ్ జాబ్స్ లభిస్తాయి. ప్రేమలు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. దృష్టిదోషం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఏ పని చేపట్టినా ఏం చేస్తున్నారా అని ఆసక్తిగా చూసే వారు అధికం. క్రయవిక్రయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆహారాల్లో మార్పులు చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. బయటికన్నా ఇంట్లో ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో మాట పట్టింపులు పెరుగుతాయి. పాత విషయాలను పదే పదే గుర్తుచేసుకుని ఎమోషన్ కు గురవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనసొకచోట, శరీరం మరో చోట అన్నట్టుగా ఎక్కువగా ఆలోచిస్తారు. అప్పులు ఇవ్వడం, తీసుకోడానికి దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగులు లేతరంగులు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు స్థలానికి సంబంధించిన క్రయవిక్రయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. రిప్రజంటేటివ్స్ కు, ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. అప్పులు తీర్చే ఆలోచనలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. అర్థం చేసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎదుటివారిని ఒప్పించడం కష్టంగా ఉంటుంది. నష్టాలు ఉండవు కానీ చిన్నపాటి ఒడిదుడుకులు ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల స్థితిగతులు ఉంటాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా అంచనా వేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎదుటివారితో మాట్లాడేటపుడు, ఎదుటివారికి అప్పులు ఇచ్చేటపుడు పునరాలోచించుకోవాలి.వాహన సౌఖ్యం ఉంటుంది. ప్రేమలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పని ఒకట్రెండుసార్లు చేస్తే పూర్తవుతుంది. అనూహ్య ప్రయాణాలు ఎదురవుతాయి. శుభవార్తలు వింటారు. రహస్యాలను పంచుకోవడం మంచిది కాదు. ఎదుటివారితో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.మానసిక ప్రశాంతత పొందుతారు. ఆర్థికంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంచుమించు రోజంతా అనుకూలంగా ఉంటుంది. నీరసాన్ని జయించడం కష్టంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు రంగులు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. కెరియర్ పై దృష్టిసారిస్తారు. రాజకీయ రంగంలో వారికి అనుకూలం. పెండింగ్ పనులపై, ఇంటి వాస్తుపై దృష్టిపెడతారు. రిస్క్ కు దూరంగా ఉంటారు. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలన్న ఆలోచనలు బలపడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story