Mon Dec 23 2024 16:47:03 GMT+0000 (Coordinated Universal Time)
APRIL 18 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నింటా విజయాలు వరిస్తాయి. రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, మంగళవారం
తిథి : బ.త్రయోదశి మ.1.27 వరకు
నక్షత్రం : ఉత్తరాభాద్ర రా.1.00 వరకు
వర్జ్యం : ఉ.11.28 నుండి 12.58 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.23 నుండి 9.12 వరకు, రా.10.57 నుండి 11.43 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : సా.4.50 నుండి 5.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ప్రయాణాలు చోటుచేసుకుంటాయి. అలసట పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అభద్రతా భావం ఏర్పడుతుంది. కాంట్రాక్ట్ రంగంవారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఒత్తిడులున్నా తట్టుకుని ముందుకి సాగుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూల ఫలితాలుంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా నూతన రుణాలు అందుతాయి. నిరుద్యోగులు గట్టి ప్రయత్నాలు చేస్తే ఫలితం ఉంటుంది. దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. పరిచయాలు బలపడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు మెరున్ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. సానుకూలించే వాతావరణంలో అనుకూలించే వర్గం ఉండటంతో రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. బాధ్యతలు నెరవేర్చుకుంటారు. పిల్లలతో కలిసి సమయం గడుపుతారు. ప్రయాణాలపై రూపకల్పనలు చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా కొనసాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఊరట కలుగుతుంది. కొండల్లాగా వచ్చే కష్టాలు మబ్బుల్లాగా విడిపోతాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలుంటాయి. ప్రతి విషయంలో మీ ప్రతిభ కనబరుస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక, కుటుంబ విషయాలు, ఎదుటివారిని అంచనా వేయడంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రుబలం, దృష్టిదోషం పెరుగుతున్నాయి. అనవసరమైన తగాదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఎదుటివారిని సందేహంగా చూసే ధోరణి పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నింటా విజయాలు వరిస్తాయి. రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి. పెళ్లిచూపులు లాంటివి సక్సెస్ అవుతాయి. బాధ్యతలు నెరవేర్చుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగస్తులకు ఊరట కలుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఊరట లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ఎదుటివారికి ధీటైన జవాబిస్తారు. సంఘ గౌరవాన్ని కలిగి ఉంటారు. దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. వ్యాపారాలను విస్తరింపజేసే ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ ఫలితాలు తక్కువగా ఉంటాయి. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. కోపం పెరుగుతుంది. పెద్దగా నష్టాలు ఉండవు కానీ చికాకులు పెరుగుతాయి. మనసుకి నచ్చని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉచిత సలహాలు ఇవ్వడం, తీసుకోడానికి దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఏమరపాటుతనం పనికిరాదు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిదానంగా వ్యవహరించాలి. అనవసరమైన తగాదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. వృధాఖర్చులు పెరుగుతాయి. మాటలో తెలియకుండానే వేగం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. అప్పు ఇవ్వడం, తీసుకోడానికి దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మంచి ఆహారాన్ని స్వీకరిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగపరంగా తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. ఎదుటివారిని అంచనా వేయగలుగుతారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. స్నేహాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఉపయోగపడే ఖర్చులే అయినా శృతి మించుతాయి. రుణప్రయత్నాలు తప్పకపోవచ్చు. రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. రోజంతా గందరగోళంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గడిచిన రెండ్రోజులకంటే అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలపై ఆసక్తిని కనబరుస్తారు. ఫీల్డ్ ను మార్చుకోవాలనే ఆలోచనలు బలపడతాయి. దంపతుల మధ్య తగాదాలు టీ కప్పులో తుపానులా కొట్టుకుపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story