Mon Dec 23 2024 23:16:37 GMT+0000 (Coordinated Universal Time)
APRIL 1 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తలు అధికంగా పాటించాలి. అంతంతమాత్ర ఫలితాలుంటాయి. రోజంతా సాధారణంగా..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, శనివారం
తిథి : శు.ఏకాదశి తె.4.20 వరకు
నక్షత్రం : ఆశ్లేష తె.4.47 వరకు
వర్జ్యం : సా.4.15 నుండి 6.02 వరకు
దుర్ముహూర్తం : ఉ. 6.06 నుండి 7.43 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.45 నుండి 11.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బాగా శ్రమిస్తారు. శత్రుబలం, దృష్టిదోషం అధికమవుతాయి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడుల ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మీకు నచ్చినట్టుగా వ్యవహరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు విలాసాలకు ప్రాముఖ్యతనిస్తారు. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. చేసే పనిపై అధిక శ్రద్ధ కనబరుస్తారు. వ్యాపారాల్లో సానుకూలతలు ఉంటాయి కానీ.. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. శారీరక, మానసిక ఒత్తిడి, అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. అయినవారే తక్కువగా చూడటంతో మనసుకు కష్టం కలుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. మనసులోని మాటలను ఎదుటివారితో నిర్మొహమాటంగా చెబుతారు. ఉద్యోగులు, వ్యాపారస్తులు, అన్ని వృత్తుల వారికి అనుకూల ఫలితాలుంటాయి. అనుకున్నంత మేర డబ్బును సంపాదిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కెరియర్ పై దృష్టిసారిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నెలంతా ఇలా చేయాలి అని ప్లాన్ చేసుకుంటారు. దంపతుల మధ్య తగాదాలు, విభేదాలను తొలగించుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తలు అధికంగా పాటించాలి. అంతంతమాత్ర ఫలితాలుంటాయి. రోజంతా సాధారణంగా గడిచిపోతుంది. లాభనష్టాలుండవు. ఎవరూ అర్థం చేసుకోవడం లేదన్న భావజాలంలో ఉంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ కు దూరంగా ఉండాలి. ప్రతిదానిని అనుమానంగా చూడటం మంచిది కాదు. ఆర్థిక స్థితిగతులు ఒడిదుడుకులకు గురిచేస్తాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఉద్యోగులకు పనివేళలు పెరుగుతాయి. రిస్క్ కు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలపై దృష్టిసారిస్తారు. అప్పుల నుంచి బయటపడే ప్రయత్నాలు ఫలిస్తాయి. తీరని సమస్యల పరిష్కారానికి దృష్టిసారిస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూల ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు అనుకూలం. విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి. వైద్య సలహాలు, సంప్రదింపులు కలసివస్తాయి. శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. పదే పదే వివాదాలు చోటుచేసుకుంటాయి. మీ మాటను వక్రీకరించే అవకాశాలు ఎక్కువ. వృథా ఖర్చులుంటాయి. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story