Mon Dec 23 2024 15:47:59 GMT+0000 (Coordinated Universal Time)
APRIL 21 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. శ్రమ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పాత..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్రవారం
తిథి : శు.పాడ్యమి ఉ.8.29 వరకు
నక్షత్రం : భరణి రా.10.58 వరకు
వర్జ్యం : ఉ.8.41 నుండి 10.16 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.21 నుండి 9.11 వరకు, మ.12.30 నుండి 1.20 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎదుటివారి నుండి సహాయం పొందుతారు. ఆర్థిక సర్దుబాట్లకు ఉపయుక్తమైన కాలం. ఉద్యోగులు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ప్రయాణాల వల్ల ప్రయాసే మిగులుతుంది. అనవసరమైన తగాదాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. క్రయవిక్రయాల పరంగా సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. శ్రమ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పాతవిషయాలు పదేపదే గుర్తొస్తాయి. అందరి మాటల్ని మౌనంగా వినాల్సిన స్థితి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ఆందోళనకు గురవుతారు. పనులు చకచకా కొనసాగుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కోపం పెరుగుతుంది. శత్రుబలాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా, ఆరోగ్యంగా జాగ్రత్త అవసరం. కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అంచనాకు వచ్చే ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా, రిజిస్ట్రేషన్ పనులు, పెండింగ్ పనులు పూర్తి చేసుకునేందుకు అనుకూలం. కాంట్రాక్ట్, కళా, సాహిత్య రంగాల వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉన్నా ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఆర్థిక విషయాలు కలసివస్తాయి. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. గతంలో ఇచ్చిన అప్పులను వసూలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు అధికమవుతాయి. పనులు వాయిదా ధోరణిలో ఉంటాయి. ఎవరు మీ వారో ఎవరు శత్రువులో కనిపెట్టలేరు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మనిషి ఒకచోట, మనసొక చోట అన్నట్టుగా కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అర్థం చేసుకునేవారి సంఖ్య తగ్గుతుంది. ఎమోషన్స్ ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలమైన కాలం. పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన మేర పెట్టుబడులు లభిస్తాయి. అనుభవజ్ఞులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. పాతపరిచయాలు బలపడుతాయి. కొత్తపరిచయాలు ఉపకరిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో శ్రద్ధగా ఉండాలి. అప్పులు ఇవ్వడం, తీసుకోడానికి దూరంగా ఉండాలి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బాధ్యతలను నెరవేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story