Sun Dec 22 2024 21:16:49 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, ఏప్రిల్ 23 నుండి ఏప్రిల్ 28 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలపరంగా..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, ఆదివారం
తిథి : శు. తదియ ఉ.7.47 వరకు
నక్షత్రం : రోహిణి రా.12.25 వరకు
వర్జ్యం : సా.4.05 నుండి 5.55 వరకు
దుర్ముహూర్తం : సా.4.40 నుండి 5.30 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.00 నుండి 11.50 వరకు
నవగ్రహ సంచారం
మేషం - రవి, బుధుడు, గురువు, రాహువు
వృషభం - శుక్రుడు
మిథునం - కుజుడు
తుల - కేతువు
కుంభం - శని
మీనం, మేషం - గురువు
చంద్రగ్రహ సంచారం
మేషం, వృషభం, మిథునం, కర్కాటకం
ఏప్రిల్ 23 నుండి ఏప్రిల్ 28 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం విచిత్ర మార్పులు చోటుచేసుకుంటాయి. రకరకాల ఆలోచనలు చేస్తారు. బాగా ఎదగాలన్న కోరికలు పెరుగుతాయి. బంధువులతో వైరాగ్యం ఏర్పడవచ్చు. దృష్టిదోషం ఎక్కువగా ఉంటుంది. అలసట అధికమవుతుంది. ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. పాతపరిచయాలు ఉపకరిస్తాయి. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్ర నామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన తగాదాలు చోటుచేసుకుంటాయి. మానసిక ఆందోళన అధికమవుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలను కూడా పెద్దగా చూస్తారు. బంధువులతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తారు. అందరూ స్వార్థపరులే అని ఆలోచిస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త అప్పులు చేయడం మంచిది కాదు. ఈ వారం ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని యధాశక్తిగా పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలపరంగా తీసుకునే నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉంటాయి. తగాదాలున్నా మీదే పైచేయి అవుతుంది. కోర్టుకేసులు కాస్త తలనొప్పిగా ఉంటాయి. ఆర్థికపరంగా వెసులుబాటు లభిస్తుంది. పనులు అవుతున్నా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఏదొకటి చేసి ఆదాయ వనరులను పెంచుకోవాలని భావిస్తారు. ఈ వారం మంగళ, బుధ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ఎవరేమన్నా వినీ విననట్టుగా వదిలేసేందుకు మొగ్గుచూపుతారు. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుందని ఆలోచిస్తారు. పనులతో సతమతమవుతారు. సహకరించే వర్గం తక్కువగా ఉంటారు. చివరిక్షణంలో ఇబ్బందుల నుండి బయటపడతారు. డ్రైవింగ్ చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆలోచనా విధానంలో మార్పులు వస్తాయి.లౌక్యంగా వ్యవహరిస్తారు. ఇష్టంలేని వారిని కూడా కలుపుకుపోతారు. రాజకీయ, కళాసాహిత్య రంగాలవారికి అనుకూలం. పాతపరిచయాలతో బిజీగా ఉంటారు. ఆరోగ్యంపై అధిక శ్రద్ధ చూపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అంతంతమాత్రంగానే ఉంటుంది. వీలైనంతవరకూ రిస్క్ కు దూరంగా ఉండాలి. కోర్టుకేసులు, పోలీస్ స్టేషన్ కు సంబంధించిన అంశాలు, ఇంట్లో ఉండే తగాదాలు, మనస్ఫర్థలు ఉంటాయి. సమస్యలను వెనువెంటనే పరిష్కరించుకోవాలని ఎంత తొందరపడతారో ఈ సమస్య అంత జటిలంగా మారతాయి. దగ్గరగా వచ్చిన సంబంధం దూరమయ్యే అవకాశాలున్నాయి. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ, శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. అంతా బాగానే ఉన్నా మానసిక తృప్తి ఉండదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాలలో తెలియని అసంతృప్తి నెలకొంటుంది. డబ్బు నీళ్లప్రాయంగా ఖర్చైపోతుంది. ఎలాగైనా సంపాదించాలన్న పట్టుదల కూడా అదేస్థాయిలో ఉంటుంది. నిరుద్యోగులకు ఊరటకలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతోషాన్నిస్తాయి. గడిచిన మూడువారాలకంటే ఈవారం అనుకూలమైన ఫలితాలుంటాయి. ఈ వారం గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం గురుబలం తగ్గుతుంది. అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. మీవారెవరో, శత్రువులెవరో తెలుసుకోవడంలో విఫలమవుతాయి. గౌరవ, మర్యాదలు తగ్గుతున్నట్టు ఉంటుంది. కోప, తాపాలకు పోయి ముఖ్యమైన వారిని, అయినవారిని దూరంగా ఉంచుతారు. ముఖ్యమైన సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోకపోవడంతో అనవసరమైన వివాదాలు చోటుచేసుకుంటాయి లేదా ఆశించినమేర లాభాలు పొందలేకపోవచ్చు. వ్యాపారస్తులు అధికజాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఉపకరిస్తాయి. ఈ వారం ఆది, సోమవారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం తలపెట్టే పనులన్నింటినీ త్రికరణ శుద్ధిగా చేస్తారు. ఉద్యోగపరంగా మార్పులు, చేర్పులు చేసుకోవాలన్న నిర్ణయానికి వస్తారు. అద్దె ఇల్లు మారుతారు. విహారయాత్రలు, వినోదకార్యక్రమాలతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం గురుబలం తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు మరింత శ్రమించాలి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అందంపై దృష్టిసారిస్తారు. ఈవారం పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం పనులు సానుకూలంగా సాగుతాయి. చేతికి రావాల్సిన డబ్బు అందదు. చెల్లించవలసిన డబ్బు ఆగదు. ప్రేమ పెళ్లికంటే పెద్దలు కుదిర్చిన వివాహమే మేలు చేస్తుంది. విడాకులు వంటివాటికి దూరంగా ఉండాలి. మొండితనం, కోపం పెరుగుతాయి. ఈ వారం గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం లౌక్యంగా వ్యవహరిస్తారు. ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటారు. ప్రేమలు వివాదాస్పదమవుతాయి. ఇంట్లో కూడా తరచుగా తగాదాలు అవుతాయి. తెలియకుండా మాట వివాదాస్పదమవుతుంది. ఆహారాన్ని తగ్గిస్తారు. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు పారాయణ చేయడం మంచిది.
Next Story