Mon Dec 23 2024 16:35:12 GMT+0000 (Coordinated Universal Time)
APRIL 26 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు అనుకూలంగా ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బుధవారం
తిథి : శు.షష్ఠి ఉ.11.28 వరకు
నక్షత్రం : పునర్వసు పూర్తిగా..
వర్జ్యం : సా.5.39 నుండి 7.25 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.19 నుండి 9.09 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.10 నుండి 9.56 వరకు, మ.1.50 నుండి 2.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రిజిస్ట్రేషన్ల కార్యక్రమాలు, వాహన కొనుగోళ్లు, విలాసవంతమైన కొనుగోళ్లు, ఇంటి సంబంధిత సర్దుబాట్లు సానుకూలంగా సాగుతాయి. బ్యాంక్ లావాదేవీలు సజావుగా ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మంచి చేసి మాటపడే అవకాశాలు ఎక్కువ. అప్పులు ఇవ్వడం, తీసుకోడానికి దూరంగా ఉండాలి. ఫైనాన్స్, ఎలక్ట్రానిక్ రంగాల వారు, రిస్క్ వ్యాపారాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అంచనాలు తారుమారవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా ఉంటారు. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారస్తులకు, కాంట్రాక్ట్ రంగంవారికి అనుకూలం. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉత్సాహం తగ్గుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. వృథా ఖర్చులుంటాయి. శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. రిజిస్ట్రేషన్లు, కీలక అంశాలు వెంటనే పూర్తిచేసుకోవాలి. చిన్న గాయాలు కావచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు అనుకూలంగా ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. రహస్య శత్రువులను కనిపెడతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సర్దుబాటు అనే విషయానికి దూరంగా ఉంటారు. ప్రతి విషయంలో తిరుగుబాటుతనాన్ని కనబరుస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతవరకూ ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎదుటివారికి సహాయం చేసి.. ఇబ్బందుల్ని కొనితెచ్చుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పరోపకారాన్ని కలిగిఉంటారు. ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ముందడుగు వేయాలి. ఏదో చేయాలనుకుంటారు కానీ.. క్లారిటీ ఉండదు. ఏం కావాలో తెలియక దేనినీ అనుభవించలేక సమయం వృథా అవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియకుండానే కొన్ని రహస్యాలను బయటపెట్టే అవకాశాలు ఎక్కువ. ఆర్థిక విషయాలు నిరుత్సాహానికి గురిచేస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహా పాటించాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చర్చలు, ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నాలు, న్యాయపరమైన సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ల కార్యక్రమాలు, భూమి కొనుగోళ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గౌరవ, మర్యాదలను కలిగి ఉంటారు. ఎదుటివారితో మాట్లాడేటపుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. గతంలో ఇచ్చిన ధనాన్ని వసూలు చేసుకోగలిగితే మెరుగైన ఫలితాలను అందుకుంటారు. నూతన వాహన యోగం ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన తగాదాలు ఏర్పడుతాయి. వృథా ఖర్చులుంటాయి. మొండితనం పెరుగుతుంది. ఏ పనీ ముందుకు సాగదు. బంధువులతో తగాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వ ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎంత మంచిగా మాట్లాడినా అపార్థాలు పెరుగుతాయి. ఉచిత సలహాలివ్వడం మంచిది కాదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో సాధారణ ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story