Mon Dec 23 2024 15:35:07 GMT+0000 (Coordinated Universal Time)
APRIL 28 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్రవారం
తిథి : శు.అష్టమి సా.4.01 వరకు
నక్షత్రం : పుష్యమి ఉ.9.51 వరకు
వర్జ్యం : రా.12.12 నుండి 2.00 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.18 నుండి 9.09 వరకు, మ.12.30 నుండి 1.20 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.1.40 నుండి 2.35 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రకరకాల ఆలోచనలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశాలు తక్కువ. వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులు పనిచేశామంటే చేశామన్నట్టుగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. ప్రయాణాలు కలసివస్తాయి. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. తగాదాల్లో మీదే పైచేయి అవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. విలాసవంతమైన జీవితాన్ని గడపాలన్న ఆసక్తి బాగా పెరుగుతుంది. ప్రేమలు వివాదాస్పదమవుతాయి. ఆరోగ్యం పట్ల అధిక జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కష్టేఫలి అనే సూత్రాన్ని నమ్ముకుంటారు. రిజిస్ట్రేషన్ల కార్యక్రమాలను సజావుగా పూర్తిచేసుకుంటారు. ఎదుటివారు చెప్పే వాటిలో మీకు కావలసినవే వింటారు. వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలి. తలనొప్పి బాధిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ మీది.. ఫలితాలు మాత్రం ఎదుటివారు పొందుతారు. మేలు చేసి మాట పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతీ విషయంలో సావధానంగా జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల వల్ల లాభం ఉండదు. మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. చేస్తున్న ఉద్యోగం నుంచి ఉన్నతస్థానానికి వెళ్లే ప్రయత్నాలు కలసివస్తాయి. చిన్ననాటి స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు. రోజంతా మానసిక ప్రశాంతత, ధృడమైన సంకల్పంతో ముందుకుసాగుతారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఫీల్డ్ మార్చుకునే ఆలోచనలు బలపడతాయి. కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకునేందుకు వాటికి సంబంధించిన క్లాసుల్లో చేరుతారు. ఏ నిర్ణయం తీసుకున్నా సహకరించేవారుంటారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎదుటివారు పొగడ్తలతో మీతో తమ పనులను చేయించుకుంటారు. పనులు చేయక తప్పని పరిస్థితి ఉంటుంది కానీ.. ఆశించిన మేర ఫలితాలుండవు. ఇంట్లోని వారి మాటలు ఇబ్బంది పెడతాయి. బాధ్యతలు బరువుగా పరిణమిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఏ పనిచేసినా రహస్యంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చర్చలు ఫలిస్తాయి. స్థిర చరాస్తులపై దృష్టిసారిస్తారు. పిత్రార్జిత ఆస్తి విషయంలో ఓ నిర్ణయానికి వస్తారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. పాత పరిచయాలు బలపడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాల అంశాలు అనుకూలంగా ఉంటాయి. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఒత్తిడి అధికంగా ఉన్నా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. అయినవారే విమర్శించే అవకాశాలు ఎక్కువ. బంధువైరాలు ఏర్పడుతాయి. విద్యార్థులకు అనుకూలం. వాహన ప్రమాదాలుంటాయి. అనారోగ్యం విషయంలో ఏమరపాటుతనం పనికిరాదు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
Next Story