Mon Dec 23 2024 02:40:33 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 8 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారంలో ఖర్చులు పెరుగుతాయి. అర్థం చేసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఒత్తిడి..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, ఛైత్ర మాసం, ఆదివారం
తిథి : శు.ద్వాదశి పూర్తిగా
నక్షత్రం : మఖ పూర్తిగా
వర్జ్యం : సా.6.05 నుండి 7.51 వరకు
దుర్ముహూర్తం : సా.4.39 నుండి 5.28 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.20 నుండి 11.50 వరకు
నవగ్రహ సంచారం
మేషం - బుధుడు, రాహువు
మేషం, వృషభం - శుక్రుడు
మిథునం - కుజుడు
తుల - కేతువు
కుంభం - శని
మీనం - రవి, గురువు
చంద్రగ్రహ సంచారం
సింహం, కన్య, తుల
ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 8 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్లానింగ్స్ పై దృష్టిసారిస్తారు. స్కీమ్స్ వంటి వాటిలో చేరతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎలాంటి ఇబ్బందులుండవు.చిన్న చిన్న ఒడిదుడుకులను అధిగమిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దంపతుల మధ్య తరచుగా గొడవలు జరగడం సహజం. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ పెరుగుతుంది. ఒత్తిడి అధికమవుతుంది. ప్రతి పనినీ దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రేమలకు దూరంగా ఉండటం మంచిది. వ్యసనాల వల్ల ఇబ్బందులు తప్పవు. ఇబ్బందులను ఎదుర్కొనే శక్తి కొరవడుతుంది. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. వీలైతే ప్రతిరోజూ నరసింహస్వామి వారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. పాత అప్పులు తీర్చి కొత్త అప్పులు చేస్తారు. క్రెడిట్ కార్డు వినియోగం పెరుగుతుంది. చేసే ఉద్యోగం మారాలన్న నిర్ణయానికి వస్తారు. కోపం పెరుగుతుంది. ఎంత కష్టపడినా ఫలితం తక్కువగా ఉంటుందని నిరుత్సాహపడతారు. టీవీ, మొబైల్ వినియోగం పెరుగుతుంది. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజూ వేంకటేశ్వరస్వామి వారిని పూజించాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం గడిచిన రెండు వారాలుగా వేధిస్తున్న సమస్యల్లో ఒక క్లారిటీ వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామి అర్థం చేసుకునే అవకాశాలు తక్కువ. విదేశీయాన ప్రయత్నాలు కలసివస్తాయి. అనవసరమైన ప్రయాణాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. శారీరక అలసట పెరుగుతుంది. ఈ వారం బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారంలో ఖర్చులు పెరుగుతాయి. అర్థం చేసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది. బంధువులను, స్నేహితులను కలిసేందుకు అనుకూలం. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. ఈ వారం శారీరక, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ వారం ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. ప్రతిరోజూ ఇష్టదైవాన్ని ఎర్రటిపూలతో పూజించాలి.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. అష్టమంలోనే మూడు గ్రహాల సంచారం ఉండటంతో ఆర్థిక, కుటుంబ విషయాల్లోఆచి తూచి అడుగులు వేయాలి. ఫైనాన్స్ సెక్టార్లో ఉన్నవారు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పని పూర్తయ్యేవరకూ ఎవరితోనూ చర్చించకపోవడం మంచిది. ఈ వారం బుధ, గురు వారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుదర్శనకవచ పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. కొత్త మార్పు ఏర్పడుతుంది. ఖర్చులు నీళ్లప్రాయంగా అవుతుంటాయి. పొగిడే వారి సంఖ్య, మీ వల్ల లాభపడే వారి సంఖ్య పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు. జీవిత భాగస్వామి పట్ల తెలియని అసంతృప్తి ఏర్పడుతుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఇంటి అలంకరణపై దృష్టిసారిస్తారు. నిరుత్సాహాన్ని దరిచేరనివ్వరు. ఈ వారం ఆది, సోమ శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. అలాగే ప్రతిరోజూ వినాయకుడిని పూజించడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ఎవరివద్ద ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయో అలాగే వ్యవహరిస్తారు. లౌక్యం ప్రదర్శిస్తారు. నిద్రాహారాలు కలిగి ఉంటారు. వ్యూహాలను అమలు చేస్తారు. వినోదాలు, విహార యాత్రల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పరంగా కొంత నలతగా ఉంటుంది. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి. తగాదాలకు దూరంగా ఉండాలని రాజీ పడతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులుండవు. ఈ వారం బుధ, గురు, శుక్ర, శని వారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఎవరితోనూ ఏ విషయాన్ని ఎక్కువగా పంచుకోవడం మంచిది కాదు. ఎమోషన్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి. ప్రతి విషయంలో అంటిముట్టనట్టుగా ఉండాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని, శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రుబలం పెరుగుతుంది. రహస్యంగా ఇబ్బంది పెట్టే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. పొదుపు అంతంతమాత్రంగా ఉంటుంది. ఆరోగ్యం ఒడిదుడుకులుగా ఉంటుంది. మంచి కొంచమైతే.. చెడు చాలా ఉంటుంది. రిస్క్ కు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం క్రయవిక్రయాలు కలసివస్తాయి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఊరటనిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. పూర్తి కాని పనిని వదిలేసి ప్రశాంతంగా ఉంటారు. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. అపార్థాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story