Mon Dec 23 2024 23:02:00 GMT+0000 (Coordinated Universal Time)
APRIL 4 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, మంగళవారం
తిథి : శు.త్రయోదశి ఉ.8.05 వరకు
నక్షత్రం : పూర్వ ఫల్గుణి ఉ.9.35 వరకు
వర్జ్యం : సా.5.19 నుండి 5.15 వరకు
దుర్ముహూర్తం : ఉ. 8.30 నుండి 9.19 వరకు, రా.10.59 నుండి 11.46 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.1.15 నుండి 2.05 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అప్పులు ఇవ్వడం, తీసుకోడానికి దూరంగా ఉండాలి. కెరియర్ ను సీరియస్ గా తీసుకుంటారు. కాంట్రాక్ట్ రంగంలో వారు జాగ్రత్తలు తీసుకోవాలి. రహస్య విషయాలను తెలుసుకుంటారు. ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులు, శ్రేయోభిలాషులు అర్థం చేసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వైద్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. తగాదా పడితే పూర్తయ్యే పనులపై దృష్టిసారిస్తారు. ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటారు. అధికారుల మెప్పు పొందుతారు. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. రూమర్స్ ప్రచారంలో ఉంటాయి. ఆర్థికంగా, వ్యవహారికంగా, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభనష్టాలుండవు. రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఫీల్డ్ మారే ఆలోచనలు బలపడుతాయి. ఎదుటివారిని అంచనా వేస్తారు. శత్రుబలం తగ్గుతుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే ప్రయత్నాలు కలసివస్తాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. మీ తప్పు లేకపోయినా ఆఫీస్, లేదా ముఖ్యమైన ప్రాంతాలకు వేళకు చేరుకోలేక ఇబ్బంది పడతారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. దంపతుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఎక్కువగా ఉంటాయి. వాస్తుపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కెరియర్ పరంగా ఒత్తిడి పెరుగుతుంది. ఒకే సమయంలో అనేక పనులు సాధ్యం అయ్యేందుకు ఇబ్బంది పడతారు. క్రెడిట్ కార్డు వినియోగం పెరుగుతుంది. ఇష్టమైన వ్యక్తులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. బ్రేకప్ అయిన ప్రేమలు మళ్లీ కొత్త ఆశలు ఏర్పడే అవకాశాలున్నాయి. నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రిస్క్ కు దూరంగా ఉండాలి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఎవరినీ అంచనా వేయకపోవడం మంచిది. పనులను వాయిదా వేయడంతో మేలు జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. శారీరక అలసట పెరుగుతుంది. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు లభిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పాతపరిచయాలు ఉపకరిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. చురుగ్గా వ్యవహరిస్తారు. ప్రతి విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అంచనాలకు తగ్గట్టుగా రోజంతా సాగుతుంది. ఇంటి అవసరాలను సమకూర్చుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story