Mon Dec 23 2024 23:03:16 GMT+0000 (Coordinated Universal Time)
APRIL 5 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులు..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బుధవారం
తిథి : శు.చతుర్ధశి ఉ.9.19 వరకు
నక్షత్రం : ఉత్తర ఫల్గుణి ఉ.11.21 వరకు
వర్జ్యం : రా. 8.13 నుండి 9.54 వరకు
దుర్ముహూర్తం : మ.11.45 నుండి 12.34 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.15 నుండి 10.10 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సమర్థవంతంగా పనిచేస్తారు. సానుకూల ఫలితాలుంటాయి. శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలు చక్కగా ఉంటాయి. విహార యాత్రలు, వినోద కార్యక్రమాలు మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఎదుటివారిని సహాయం అడగటం, రుణ ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వస్తు భద్రత పాటించాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా వేస్తారు. బద్ధకం పెరుగుతుంది. లాభనష్టాలుండవు. రోజంతా సాఫీగా సాగిపోతుంది. కళా సాహిత్య రంగం, రాజకీయ రంగంలోవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. సహకరించే వర్గం చేరువలో ఉంటుంది. పెద్దమొత్తంలో కావలసిన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుటివారిని మీకు అనుకూలంగా ఒప్పించగలుగుతారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కాంట్రాక్ట్ రంగంలోవారికి అనుకూలం. ఊహాగానాలకు దూరంగా ఉండాలి. గతంలో జరిగిపోయిన సంఘటనల కారణంగా లేనిపోని తగాదాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇంటి అలంకరణపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూల ఫలితాలుంటాయి. ఇంచుమించుగా రోజంతా సానుకూలంగా సాగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ పెరుగుతుంది. ఫలితాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వేళకు నిద్రాహారాలు తగ్గుతాయి. ప్రశాంతత తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. తీరని సమస్యలపై దృష్టిసారిస్తారు. అప్పులను వసూలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కెరియర్ పై దృష్టిసారిస్తారు. కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం పరంగా ఊరట లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఆర్థికంగా వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటుంది. అరుగుదల సమస్యలతో ఇబ్బంది పడతారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువులెవరో.. మిత్రులెవరో కనిపెట్టడం కష్టంగా ఉంటుంది. అప్పులు పెనుముప్పుగా మారుతాయి. పెద్దగా లాభాలుండవు. ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు పాటించాలి. రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రేమలు ఫలిస్తాయి. ఎదుటివారిని ఒప్పించే ప్రయత్నాలు కలిసివస్తాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఇబ్బంది పెట్టేవారిని చిరునవ్వుతో అధిగమిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story