Mon Dec 23 2024 20:31:45 GMT+0000 (Coordinated Universal Time)
APRIL 8 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొనుగోళ్లపై దృష్టిసారిస్తారు. అనవసరంగా ఇది కొన్నానేమో అని ఆలోచిస్తారు.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శనివారం
తిథి : బ.విదియ ఉ.10.11 వరకు
నక్షత్రం : స్వాతి మ.1.57 వరకు
వర్జ్యం : రా. 7.34 నుండి 9.10 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.01 నుండి 7.39 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.11.05 నుండి 12.05 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వ్యాపారస్తులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా రుణ ప్రయత్నాలు కలసివస్తాయి. దూర బంధువులు, శ్రేయోభిలాషులను కలుసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో ఎవరి వల్ల ఇబ్బందులుంటాయో తెలుసుకుని పరిష్కరించుకుంటారు. ఎదుటివారి నుండి సహాయ, సహకారాలు పొందుతారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు మెరూన్ కలర్.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. రహస్యాలను చెప్పడం మంచిది కాదు. అప్పులు ఇవ్వడం, తీసుకోడానికి దూరంగా ఉండాలి. ధనం వృథా అయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు లాభనష్టాలుండవు. ఎమోషన్స్ ఎక్కువగా చూపిస్తారు. ఏంటో ఈ జీవితం అన్నట్టుగా వ్యవహరిస్తారు. నిరుత్సాహ పడకుండా ఉంటే చాలు. ఈ రోజు ధరించకూడని రంగు నేవీ బ్లూ కలర్.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలపై దృష్టిసారిస్తారు. క్రయవిక్రయాలపై అధిక శ్రద్ధ వహిస్తారు. అప్పులు తీరుస్తారు. ఉద్యోగులు, వ్యాపారస్తులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొనుగోళ్లపై దృష్టిసారిస్తారు. అనవసరంగా ఇది కొన్నానేమో అని ఆలోచిస్తారు. ప్రతివిషయంలో నిదానంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎదుటివారు ఒకమాట అంటే..తిరిగి వాళ్లను రెండుమాటలు అంటారు. గొడవపడైనా కావాల్సింది సాధించుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. వీలైనంత వరకూ వినోద, విలాస కార్యకలాపాలపై దృష్టిసారిస్తారు. ఇంట్లోవారి మాటకు విలువనిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉండాలి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అయినవారే మోసం చేసే అవకాశాలు ఎక్కువ. వ్యాపారస్తులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఫీల్డ్ ను మార్చుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. బరువు తగ్గాలన్న ఆలోచనలు బలపడతాయి. ఆరోగ్యంపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. తక్కువగా మాట్లాడటం మంచిది. మాటతీరు మినహా అంతా బాగుంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఎక్కువ లాభాలే పొందుతారు. ఉద్యోగులు అధికారులకు ఫిర్యాదులు చేసేందుకు, సమస్యల పరిష్కారానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. అష్టమంలో చంద్రుడు ఉండటంతో ఎదుటివారిని అపార్థం చేసుకుంటారు. క్రయవిక్రయాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలకు అనుకూలం కాదు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story