Sun Dec 22 2024 21:15:31 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 15 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేస్తారు. దంపతుల మధ్య..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, ఆదివారం
తిథి : బ.తదియ ఉ.9.35 వరకు
నక్షత్రం : విశాఖ మ.1.59 వరకు
వర్జ్యం : సా.5.55 నుండి 7.30 వరకు
దుర్ముహూర్తం : సా.4.39 నుండి 5.28 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.10 నుండి 11.50 వరకు
నవగ్రహ సంచారం
మేషం - బుధుడు, రాహువు
వృషభం - శుక్రుడు
మిథునం - కుజుడు
తుల - కేతువు
కుంభం - శని
మీనం- గురువు
మీనం, మేషం - రవి
చంద్రగ్రహ సంచారం
తుల, వృశ్చికం, ధనస్సు, మకరం
ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 15 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. అన్ని విషయాల్లోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో సమయంగడిపే అవకాశాలు ఉండవు. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంటి అలంకరణపై దృష్టి సారిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ వారం ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ దుర్గా అమ్మవారిని పూజించి, దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం శ్రమ ఎక్కువ ఫలితాలు తక్కువగా ఉంటాయి. అర్థం చేసుకునేవారి సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. కొత్త అప్పులు చేసి, పాత అప్పులను తీరుస్తారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో తరచుగా తగాదాలు, విభేదాలు ఏర్పడుతాయి. ఉద్యోగులకు పనివేళలు పెరుగుతాయి. వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించాలి. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వినాయకుడిని ఎర్రటి గన్నేరు పూలతో పూజించి, సంకష్ఠహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేస్తారు. దంపతుల మధ్య తగాదాలు, విభేదాలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. బయటి ఆహారాన్ని వీలైనంత దూరంగా ఉంచాలి. వృత్తి, ఉద్యోగాల్లో లాభనష్టాలుండవు. మంచి పరిచయాలు ఏర్పడుతాయి. ప్రేమ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆంజనేయ స్వామివారిని పూజించి, హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. సంపాదనపై దృష్టిపెడతారు. పాతపరిచయాల కన్నా కొత్త పరిచయాలు ఉపకరిస్తాయి. మనుషుల నిజస్వరూపాలు బయటపడుతాయి. రహస్య శత్రువులని కనిపెట్టగలుగుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభనష్టాలుండవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిద్రలేమితో ఇబ్బందులు తప్పవు. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం విచిత్ర గ్రహస్థితి ఉంటుంది. ఆర్థికంగా బాగున్నారా? బాలేదా ? అన్న సందిగ్ధత ఉంటుంది. ప్రతి విషయంలో తృప్తి లోపిస్తుంది. వ్యాపారస్తులకు రొటేషన్లు టైట్ గా ఉంటాయి. సినీ, కళా, సాహిత్య రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై దృష్టిసారిస్తారు. కుటుంబం గురించి ఆలోచనలు చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. పనిచేయవలసిన విషయంలో తప్పదా అన్నట్లుగా వ్యవహరిస్తారు. మొహమాటంగా వ్యవహరిస్తారు. ఇంట్లోని వాతావరణం మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యంగా ఇబ్బందులు ఉండవు కానీ.. మానసికంగా ఇబ్బందిపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం సోమవారం మాత్రమే అనుకాలంగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఎదుటివారి నుంచి మీకు వ్యతిరేక రెస్పాన్స్ వస్తుంది. నీ మాట ప్రకారమే చేద్దామన్న లాజిక్ తో వ్యవహరిస్తే.. ఈ వారమంతా ఆనందంగా గడిచిపోతుంది. సంతానలేమి చింత పెరుగుతుంది. మళ్లీ జన్మంటూ ఉంటే మనిషిలా పుట్టకూడదనుకుంటారు. రాత్రిళ్లు ఎక్కువగా ఆలోచిస్తారు. కొత్త మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ వారం బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. అలాగే మంగళ, శనివారాల్లో ఆంజనేయస్వామికి 108 ప్రదక్షిణలు లేదా 108 తమపాకులతో అర్చన చేయించుకోవాలి.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం విచిత్రంగా ఉంటుంది. అంతా బాగున్నట్టే ఉన్నా ఏదో తృప్తి లోపం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. రిప్రంజెంటేటివ్ లకు కూడా ప్రెషర్ పెరుగుతుంది. బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు. మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెరుగుతాయి. ఇంట్లోని వారితో అనవసరంగా మాటలు పడవలసి ఉంటుంది. ఏ పనినీ సరిగ్గా పూర్తిచేయలేకపోతున్నామన్న భయం, ఆందోళన వెంటాడుతుంది. శత్రుబలం, దృష్టిదోషం పెరుగుతుంది. ఈ వారం సోమ, శుక్ర, శనివారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం బ్యాలెన్స్ డ్ గా ఉంటారు. ప్రతి విషయంలో గోప్యతను పాటిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల పరంగా తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి.కుటుంబ సభ్యులు మాత్రం మీ విధానాల పట్ల విముఖత వ్యక్తం చేస్తారు. అనారోగ్య సమస్యల నుండి ఊరట లభిస్తుంది. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. కష్టాన్ని ఎదుర్కొందాం అనే మానసిక స్థైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ వారం బుధ, గురువారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. టీనేజర్ల విషయంలో తల్లిదండ్రులకు అగ్నిపరీక్షలు ఎదురవుతాయి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాల్లో తొందరపాటు పనికిరాదు. వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలుంటాయి. ఉద్యోగులు ఉద్యోగం మారేందుకు అనుకూలం కాదు. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని, శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. శత్రుబలం పెరుగుతుంది. జీవిత భాగస్వామిపై ప్రతిరోజూ ఏదొక కంప్లైంట్ ఉంటుంది. పూజను యాంత్రికంగా కాకుండా మనస్ఫూర్తిగా చేయాలి. ఈ వారం మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం గ్రహసంచారాలు అంత అనుకూలంగా లేవు. స్థలానికి సంబంధించిన క్రయ,విక్రయాలు అనుకూలం కాదు. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. చేస్తున్న ఉద్యోగంలోనే ఉండటం మంచిది. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. ఉద్యోగం నచ్చక, మారలేక ఇబ్బంది పడతారు. పిత్రార్జిత అమ్మకం, విభజించడానికి సరైన సమయం కాదు. ఈ వారం బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని, అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story