Mon Dec 23 2024 15:56:25 GMT+0000 (Coordinated Universal Time)
MAY 2 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా ఊరట..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, మంగళవారం
తిథి : శు.ద్వాదశి రా.11.14 వరకు
నక్షత్రం : ఉత్తరఫల్గుణి రా.7.36 వరకు
వర్జ్యం : తె.4.27 నుండి 6.08 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.25 నుండి 9.16 వరకు, రా.11.05 నుండి 11.50 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.55 నుండి 12.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు మంచికాలం. లో ఫీవర్ బాధిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన తగాదాలుంటాయి. తక్కువగా మాట్లాడటం మంచిది. మీ తప్పులేకపోయినా బాధ్యత వహించాల్సిన అవసరాలు ఏర్పడుతాయి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు వృథాగా ఉంటాయి. పనులు వాయిదా పడుతుంటాయి. మీకు సహకరించేవర్గం తక్కువ. అనవసరమైన శతృత్వ భావాలు పెరుగుతాయి. దృష్టిదోషం అధికంగా ఉంటుంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలం. మధ్యవర్తిత్వ పరిష్కార మార్గాలు కలసివస్తాయి. చేస్తున్న ఉద్యోగంతో పాటు ఇతర ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఒళ్లునొప్పులు బాధిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అప్పులు తీర్చాలన్న నిర్ణయానికి వస్తారు. పబ్లిక్ రిలేషన్స్ ను పెంచుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో యధాతథంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా ఊరట లభిస్తుంది. చాలా కాలంగా ఉన్నఅనారోగ్య సమస్యల నుండి ఊరట కలుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దృష్టిదోషం అధికంగా ఉంటుంది. మీరు ఒకటి చెప్తే ఎదుటివారికి మరోలా అర్థమవుతుంది. శత్రువులు వేధించే అవకాశాలెక్కువ. ఇరుగుపొరుగువారితో అనవసరమైన తగాదాలు చోటుచేసుకుంటాయి. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంటుంది. సంతకానికి విలువ పెరుగుతుంది. సినీ,కళా, సాహిత్య రంగాల వారికి అనుకూలం. ప్రయాణాల రూపకల్పన కలసివస్తుంది. డాక్యుమెంటేషన్ సాధారణంగా ఉంటుంది. కాంట్రాక్ట్ రంగంవారికి అనుకూలం.మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కెరియర్ కు ప్రాముఖ్యతనిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు. ప్రతివిషయంలో వ్యూహాత్మకంగా ఉంటారు. తొందరపాటు తనానికి దూరంగా ఉంటారు. ఒత్తిడి ఉన్నా తగిన లాభాన్ని అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఊరటనిచ్చే పరిణామాలు చోటుచేసుకుంటాయి. మనస్పర్థలు తొలగించుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. బద్ధకానికి దూరంగా ఉంటే అన్నీ పూర్తవుతాయి. వీలైనంత తక్కువగా మాట్లాడాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. ఎదుటివారు మోసం చేస్తున్నారన్న అనుమానాలు బలపడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూల్లో సక్సెస్ సాధిస్తారు. పార్ట్ టైమ్ ఉద్యోగాల ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడేందుకు చేయూత లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
Next Story