Wed Jan 01 2025 05:47:31 GMT+0000 (Coordinated Universal Time)
NOVEMBER 5 : నేడు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..నేటి దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు కలసివస్తాయి. పొదుపుపై దృష్టి సారిస్తారు. విద్యార్థినీ..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శనివారం
తిథి : శు.ద్వాదశి సా.5.06 వరకు
నక్షత్రం : ఉత్తరాభాద్ర రా.11.56 వరకు
వర్జ్యం : ఉ.9.42 నుండి 11.17 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.10 నుండి 7.14 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.13 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : సా.5.30 నుండి 6.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నష్టాలకు అవకాశాలెక్కువగా ఉన్నాయి. విలువైన వస్తువులు చేజారే ప్రమాదం ఉంది. ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక పరమైన విషయాలు కలసివస్తాయి. ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వాహన యోగం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంది. పనులను పూర్తి చేస్తారు. ప్రతిపనిలో విజయం సాధిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులివ్వడం తీసుకోవడం వంటివి చేయకపోవడం మంచిది. అతిగా మాట్లాడటం మంచిది కాదు. వీలైనంత వరకూ పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. దంపతుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి ఊరట లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలకు అనుకూలం. క్రయవిక్రయాలు చేస్తారు. తండ్రి లేదా తండ్రి తరపు బంధువులతో మనస్పర్థలు ఏర్పడవచ్చ. ఉద్యోగ, వ్యాపారాల్లో తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మంచి చెప్తే.. చెడు ఎదురైనట్టు ఉంటుంది. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. పనుల్లో నమ్మకం కోల్పోతారు. ఎదుటివారిచ్చిన మాట తప్పే అవకాశాలున్నాయి. ఈ రోజంతా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు కలసివస్తాయి. పొదుపుపై దృష్టి సారిస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. శత్రుబలం తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. క్రయవిక్రయాల విషయంలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. వివాదాలు రాజ్యమేలుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story