Mon Dec 23 2024 02:47:38 GMT+0000 (Coordinated Universal Time)
Dec 11th to Dec 17th Horoscope : నేటి పంచాగం, ద్వాదశ రాశుల వారఫలాలు, పరిహారాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. భవిష్యత్ పై దృష్టి సారిస్తారు. ఎదుటివారిచ్చిన..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, ఆదివారం
తిథి : బ.తదియ సా.4.41 వరకు
నక్షత్రం : పునర్వసు రా.8.36 వరకు
వర్జ్యం : ఉ.7.09 నుండి 8.57 వరకు, తె.5.36 నుండి ఉ.7.24 వరకు
దుర్ముహూర్తం : సా.4.04 నుండి 4.48 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.9.00 నుండి 9.40 వరకు
నవగ్రహ సంచారం
మేషం -రాహువు
వృషభం - వక్రగతిలో కుజుడు
తుల - కేతువు
వృశ్చికం, ధనస్సు - రవి
ధనస్సు - బుధుడు, శుక్రుడు
మకరం - శని
మీనం -గురువు
చంద్రగ్రహ సంచారం
మిథునం, కర్కాటకం, సింహం, కన్య
డిసెంబర్ 11 నుండి 17 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. అధికారులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి, తండ్రి తరపు బంధువులతో అభిప్రాయ బేధాలు ఏర్పడవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. బ్యాంక్ రుణాలు అందుతాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. రహస్యాలను ఎవరికీ చెప్పకపోవడం ఉత్తమం. ఈ వారం శనివారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. శ్రీరామ రక్షాస్తోత్రాన్ని ప్రతిరోజూ పఠించడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శారీరక అలసట పెరుగుతుంది. నూతన పెట్టుబడులతో వ్యాపార ప్రారంభాలు చేస్తారు. రిజిస్ట్రేషన్లలో మోసపోయేందుకు ఆస్కారం ఉంది. దంపతుల మధ్య తగాదాలు పెరుగుతాయి. ఈ వారం సోమ, మంగళ వారాలు అనుకూలంగా ఉంటాయి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. శుభకార్యాల విషయంలో నేర్పుగా వ్యవహరించాలి. వ్యసనాలు లేదా నమ్మకద్రోహం వల్ల ఇబ్బందులు పడుతాయి. స్త్రీలకు, పురుషులకు స్త్రీల వల్ల ఇబ్బందులు రావొచ్చు. ఆరోగ్యం మెరుగవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలకు అనుకూలం కాదు. ఈ వారం బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆస్తి పంపకాలు, స్థిరాస్తి కొనుగోళ్లకు మంచి కాలం. అన్నదమ్ముల మధ్య తగాదాలు సమసిపోతాయి. మనసుకు తృప్తినిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఈ వారం సోమ, మంగళ, శనివారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఉపకరిస్తాయి. రుణాలు తీర్చే ప్రయత్నాలు కలసివస్తాయి. ఆరోగ్యంపై దృష్టిసారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. దంపతుల మధ్య తగాదాలు, విభేదాలు తొలగిపోతాయి. అప్పులు ఇవ్వడానికి మాత్రం దూరంగా ఉండాలి. బంధుగణంతో మాట పట్టింపులు రావొచ్చు. కష్టేఫలి సూత్రాన్ని నమ్ముకుంటారు. ఈ వారం బుధ, గురువారాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజూ యధాశక్తిగా వినాయకుడిని పూజించాలి.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ప్రతి పనిని పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యానికి వైద్యం లభిస్తుంది. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాలు నిశ్చయవుతాయి. అపార్థం చేసుకున్నవారే తిరిగి అర్థం చేసుకుంటారు. గొంతు సంబంధిత సమస్యలు బాధిస్తాయి. ఈ వారం సోమ, మంగళ, శనివారాలు అనుకూలిస్తాయి. ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. సంపాదనపై దృష్టిసారిస్తారు. పాత పరిచయాలు, పాత అలవాట్లు పునరావృతమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. జీవిత భాగస్వామి సహాయ, సహకారాలు అందుకుంటారు. ప్రయాణాలు, వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త అవసరం. శత్రుబలం, దృష్టిదోషం అధికమవుతాయి. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. భవిష్యత్ పై దృష్టి సారిస్తారు. ఎదుటివారిచ్చిన మాటను గుర్తుచేసి.. పని చేయించుకుంటారు. ఉద్యోగ మార్పులు ఉంటాయి. నూతన పెట్టుబడులు కలసివస్తాయి. పెళ్లిపనులు సాఫీగా సాగుతాయి. కొత్త, పాత పరిచయాలు బలపడుతాయి. ఫైనాన్స్ రంగంలోవారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ వారం బుధ,గురు,శుక్ర,శని వారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం చేయడం మంచిది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. గౌరవ, మర్యాదలకు భంగం ఉండదు. శరీరం ఇబ్బంది పెడుతుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. కష్టానికి తగిన గుర్తింపు ఉండదు. ముక్కుసూటి నైజంతో కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉంటాయి. ఈవారం శనివారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజూ వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉండాలి. గౌరవ, మర్యాదలకు భంగం కలగవచ్చు. శత్రుబలం, దృష్టిదోషం అధికంగా ఉంటాయి. శుభకార్యాలు సజావుగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్లో ఎదురుదెబ్బలు తగలవచ్చు. ఈ వారం ఆది, సోమ, మంగళ వారాలు అనుకూలంగా ఉంటాయి. నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన సర్దుబాట్లకు మంచికాలం. ఎదుటివారిని ఒప్పించేందుకు సరైన సమయం. పని ఒత్తిడి నుండి ఊరట లభిస్తుంది. మానసిక ప్రశాంతత, తృప్తి కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. స్వయంకృతాపరాధం మినహా అంతా మంచిగా సాగుతుంది. ఈ వారం సోమ,మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఇబ్బందులు ఎదురైనా అవలీలగా అధిగమిస్తారు.ఆర్థిక వనరులను సమకూర్చుకుంటారు. కొత్తపరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story