Sat Dec 28 2024 03:20:16 GMT+0000 (Coordinated Universal Time)
DECEMBER 14 : నేటి పంచాగం, దినఫలాలు : ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, బుధవారం
తిథి : బ.షష్ఠి రా.11.24 వరకు
నక్షత్రం : మఖ తె.5.16 వరకు
వర్జ్యం : మ.3.54 నుండి 5.41 వరకు
దుర్ముహూర్తం : మ.11.40 నుండి 12.24 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.45 నుండి 10.40 వరకు, మ.2.00 నుండి 3.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అన్నివిధాలా సహకరిస్తుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. బ్యాంక్ ఉద్యోగులకు అనుకూలం. చర్చలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడతాయి. ఖర్చులు పెరగవచ్చు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. చిన్న తప్పుల వల్ల పెద్ద ఇబ్బందులు రావొచ్చు. విహార, వినోద కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. ఉద్యోగులకు కాలం సహకరిస్తుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు కలసివస్తాయి. ఒళ్లునొప్పుల సమస్యలు బాధిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారితో మాట్లాడేటపుడు ఆచితూచి వ్యవహరించాలి. అధికారులతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు. స్థిరచరాస్తులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. శారీరక శ్రమ పెరుగుతుంది. కష్టేఫలి అన్నట్టుగా ఉంటారు. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తల్లి లేదా అత్తగారితో విభేదాలు ఏర్పడవచ్చు. మిమ్మల్ని అర్థంచేసుకోవడం లేదన్న ఆలోచనలు బలపడుతాయి. వ్యవసాయ, కాంట్రాక్ట్, వైద్య వృత్తుల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి. ట్రేడింగ్ లో లాభాలు పొందుతారు. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం సహకరిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది. రుణ ప్రయత్నాలు కలసివస్తాయి. దృష్టిదోషం పెరుగుతుంది. ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం మెరుగ్గా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. పనులు వాయిదా వేస్తారు. వినోద, విహార కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనసుకు నచ్చినట్లు వ్యవహరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. మనసుకు కష్టం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. ఎదుటివారి మాటలకు నొచ్చుకుంటారు. గడిచిన విషయాలను నెమరు వేసుకుంటారు. ఆర్థిక చింత ఏర్పడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా సహకరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. బెటర్ మెంట్ జాబ్ లకు అనుకూలం. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నిర్మొహమాటంగా వ్యవహరిస్తారు.వైద్యుల్ని సంప్రదిస్తారు. దృష్టిదోషం ఎక్కువగా ఉంటుంది. విహార, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story