Mon Dec 23 2024 02:15:30 GMT+0000 (Coordinated Universal Time)
Dec 18th to Dec24th Horoscope : నేటి పంచాగం, ద్వాదశ రాశుల వారఫలాలు, పరిహారాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక ఇబ్బందులను సరిచేసుకునే..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, ఆదివారం
తిథి : బ.దశమి తె.3.32 వరకు
నక్షత్రం : హస్త ఉ.10.18 వరకు
వర్జ్యం : సా.6.23 నుండి 7.59వరకు
దుర్ముహూర్తం : సా.4.06 నుండి 4.51 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.7.45 నుండి 8.45 వరకు
నవగ్రహ సంచారం
మేషం -రాహువు
వృషభం - కుజుడు
తుల - కేతువు
ధనస్సు - రవి,బుధుడు, శుక్రుడు
ధనస్సు - బుధుడు, శుక్రుడు
మకరం - శని
మీనం -గురువు
చంద్రగ్రహ సంచారం
కన్య, తు, వృశ్చికం, ధనస్సు
డిసెంబర్ 18 నుండి 24 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తగదు. సహ ఉద్యోగులతో, ఎదుటివారితో తక్కువగా మాట్లాడటం మంచిది. మనసుకు ఊరటనిచ్చే వార్తలు వింటారు. ఈ వారం ఆది,సోమ, మంగళ అనుకూలంగా ఉంటుంది. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం సాధారణ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. క్రయ, విక్రయాల విషయంలో ముందడుగు వేస్తారు. బంధువర్గం సహకరించదు. విద్యార్థినీ, విద్యార్థులు అధిక శ్రద్ధను చూపించాలి. పనులు వాయిదా పడకుండా పూర్తికావు. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురు వారాలు అనుకూలంగా ఉంటాయి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూలించే గ్రహాల సంఖ్య తక్కువగా ఉన్నా ఆనందంగా గడుపుతారు. ఆదాయం ఎలా వస్తుందో.. ఎలా ఖర్చవుతుందో తెలియకుండా ఖర్చైపోతుంటుంది. నూతన ఉద్యోగాలు, వ్యాపార విషయాల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. పని పూర్తవుతుందనుకునే సమయానికి ఆటంకాలు ఏర్పడుతాయి. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక ఇబ్బందులను సరిచేసుకునే అవకాశాలున్నాయి. మధ్యవర్తిత్వ పరిష్కార మార్గాలు సుగమమవుతాయి. కోర్టుకేసులు అనుకూలంగా ఉంటాయి. శత్రుబలం తగ్గినా దృష్టిదోషం పెరుగుతుంది. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈ వారం ఆది, శుక్ర, శనివారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అన్ని విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. ఉత్సాహం లోపిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్తదనాన్ని కోరుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల వల్ల తగాదాలు, విభేదాలు రావొచ్చు. ఆశించిన మేర పెట్టుబడులు, ధనం లేకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఈ వారం సోమ, మంగళవారాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజూ శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. క్రయ, విక్రయాలు సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ఉన్నతికోసం చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. అద్దెల వసూళ్లు, కీలక నిర్ణయాలు కలసివస్తాయి. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. అపార్థాలు తొలగిపోతాయి. మానసిక, శారీరక విశ్రాంతి ఉండదు. ఈ వారం ఆది, బుధ, గురు వారాలు అనుకూలిస్తాయి. ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ప్రతి పనిని కాన్ఫిడెంట్ గా పూర్తి చేస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉన్నా.. సర్దుబాటు చేసుకుంటారు. బంధువులతో మాటపట్టింపులు ఏర్పడుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. పాత పరిచయాలు, పాతస్నేహాలు ఉపకరిస్తాయి. ఇబ్బందుల నుండి బయటపడుతారు. భవిష్యత్ పై దృష్టిసారిస్తారు. ఈ వారం సోమ, మంగళ, శుక్ర, శని వారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం గ్రహాల సహాయ, సహకారాలు కలిసివస్తాయి. ఉపకరించే వర్గం అందుబాటులో ఉంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నూతన గృహం, వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆటంకాలు తొలగిపోతాయి. క్రయవిక్రయాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తారు. పరిచయాలు ఉపకరిస్తాయి. విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. ఈ వారం ఆది,బుధ,గురు, వారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పఠించడం మంచిది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఊరట కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఇంట్లో వారిచ్చే సలహాలతో చికాకులు పెరుగుతాయి. శత్రుబలం తగ్గుతుంది. ఈ వారం ఆది,సోమ,మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం గతంలో తీసుకున్న నిర్ణయాలు సహకరిస్తాయి. ఉద్యోగ మార్పులకు అనుకూలం కాదు. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు. ఒక ప్రణాళికతో ముందుకు సాగుతారు. దాన, ధర్మాలను చేస్తారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతారు. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురు వారాలు అనుకూలంగా ఉంటాయి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం రిజిస్ట్రేషన్లు సజావుగా పూర్తవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా, ఉద్యోగ, వ్యాపారాల పరంగా నష్టాలు లేవు. శుభవార్తలు వింటారు. విదేశీ యాన ప్రయత్నాలు సహకరిస్తాయి. ఈ వారం బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం తగు జాగ్రత్తలు పాటించాలి. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనేంత మొండిగా వ్యవహరిస్తారు. కీలక నిర్ణయాలకు అనుకూలం కాదు. ప్రతి విషయంలో సంఘర్షణ ఎక్కువవుతుంది. రెండోపెళ్లి ప్రయత్నాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ వారం ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజూ విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story