Sat Dec 28 2024 18:34:23 GMT+0000 (Coordinated Universal Time)
DECEMBER 1 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గోప్యంగా చేసే పనులు ముందుకు సాగుతాయి. ఎన్ని ఇబ్బందులున్నా..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, గురువారం
తిథి : శు.అష్టమి ఉ.7.21 వరకు, శు.నవమి తె.6.14 వరకు
నక్షత్రం : పూర్వాభాద్ర తె.5.44 వరకు
వర్జ్యం : మ.12.20 నుండి 2.03 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.05 నుండి 10.50 వరకు, మ.2.32 నుండి 3.16 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.4.00 నుండి 5.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలపై చర్చలకు మంచికాలం. ఇచ్చిన అప్పులు వసూలు చేసుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రీడా,కళా రంగాల్లో ఉన్నవారికి నూతన అవకాశాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ప్రతిపనిలో సహకరించే వర్గం చేరువలో ఉంటుంది. ఆగిపోయిన పనుల్లో కదలికలు వస్తాయి. ఖర్చులను నియంత్రించుకుంటారు. ప్రయాణాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతూ కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గోప్యంగా చేసే పనులు ముందుకు సాగుతాయి. ఎన్ని ఇబ్బందులున్నా మీకు అనుకూలమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. మానసికంగా చికాకులు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారస్తులకు నామమాత్రంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. పనుల్లో ఒత్తిడి ఉన్నా సక్సెస్ అవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. క్రయవిక్రయాలు కలసివస్తాయి. అప్పులు ఇవ్వాలన్నా వసూలు చేయాలన్నా కాలం అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాలు సహకరిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనీ నిదానంగా ఉంటుంది. అర్థం చేసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతివిషయంలో అధిక జాగ్రత్తలు పాటిస్తారు. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి. బాధ్యతలను నెరవేరుస్తారు. శుభకార్యాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి చిన్న విషయంలో అనవరసమైన తగాదాలు, విభేదాలు చోటుచేసుకుంటాయి. నిదానమే ప్రధానంగా ముందుకు సాగాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతిపనిని ఛాలెంజ్ గా తీసుకుంటారు. పనులు సకాలంలో పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవసరమైన ఖర్చులుంటాయి. చెప్పాల్సిన విషయం కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు. శుభకార్యాల విషయంలో తొందరపాటు పనికిరాదు. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
Next Story