Sat Dec 28 2024 02:58:18 GMT+0000 (Coordinated Universal Time)
DECEMBER 20 : నేటి పంచాగం, దినఫలాలు, ఈ రాశివారు ప్రయాణాలు చేయకపోవడం మంచిది
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఏం మాట్లాడినా ఎదుటివారికి అపార్థంగా వెళుతుంది.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, మంగళవారం
తిథి : బ.ద్వాదశి రా.12.45 వరకు
నక్షత్రం : స్వాతి ఉ.9.55 వరకు
వర్జ్యం : మ.3.12 నుండి 4.42 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.47 నుండి 9.31 వరకు, రా.10.47 నుండి 11.39 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.12.50 నుండి 1.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయ, విక్రయాలు సానుకూలంగా సాగుతున్నాయి. వస్త్రాభరణాల కొనుగోళ్లకు, అప్పులు తీర్చేందుకు కాలం అనుకూలిస్తుంది. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. నూతన, ఉన్నత ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభం జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. మనస్పర్థలు తొలగించుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్పులు ఇచ్చేందుకు, తీర్చేందుకు మంచి కాలం. వివాదాస్పదమైన అంశాలపై దృష్టిసారిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. ఆత్మీయవర్గంతో ఏర్పడే మాట పట్టింపు మనసుకు కష్టంగా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఏం మాట్లాడినా ఎదుటివారికి అపార్థంగా వెళుతుంది. ముఖ్యమైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. తల్లి లేదా అత్తగారితో మాట పట్టింపులు ఏర్పడుతాయి. జరిగే సంఘటనలు చూసి ఆశ్చర్యపోతారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనుల్లో కదలిక ఏర్పడుతుంది. సంఘ గౌరవం పెరుగుతుంది. చిత్ర పరిశ్రమలో వారికి అనుకూలంగా ఉంటుంది. అధికారుల మెప్పు పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. సమస్యలకు పరిష్కారం లేక మానసిక ఒత్తిడికి గురవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అనుకూలమైన ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆశించిన ప్రతిఫలం అందుతుంది. శత్రుబలం తగ్గుతుంది. అంచనాలు నిజమవుతాయి. టీనేజర్లు వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలమైన, వ్యతిరేకమైన ఫలితాలుంటాయి. ఖర్చులు ఎక్కువైనా ఉపకరిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో వ్యత్యాసాలు సరిచూసుకుంటారు. లాయర్లకు అనుకూలమైన కాలం. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాల్ని అందుకుంటారు. ఇబ్బందులను అధిగమిస్తారు. వైద్య సంప్రదింపులకు కాలం అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. శ్రమని నమ్ముకుని ముందుకు సాగుతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నూతన వాహనం లేదా గృహ కొనుగోళ్లకు అనుకూలం. భవిష్యత్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. శ్రమ ఎక్కువగా, ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రిస్క్ లేని పనులు చేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. సలహాలు, సూచనలు అందుకుంటారు. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. గతంలో కూడబెట్టిన పొదుపు సొమ్మును ఉపయోగించుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story