Sat Dec 28 2024 02:58:43 GMT+0000 (Coordinated Universal Time)
DECEMBER 22 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వాహన యోగం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. సహోదోగ్యులతో విభేదాలు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, గురువారం
తిథి : బ.చతుర్దశి రా.7.13 వరకు
నక్షత్రం : జ్యేష్ఠ తె.4.03 వరకు
వర్జ్యం : ఉ.11.34 నుండి మ.1.00 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.16 నుండి 11.00 వరకు, మ.2.40 నుండి 3.24 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : మ.3.50 నుండి 4.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థికంగా నేర్పుగా వ్యవహరిస్తారు. ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటారు. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఎదుటివారిపై ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. ఉద్యోగులు, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. చర్చలు ఫలిస్తాయి. అపోహలు తొలగిపోతాయి. ఇంట, బయట ఒత్తిడి ఉన్నా ఫలితాలు అందుకుంటారు. శ్రమ ఎక్కువ, విశ్రాంతి తక్కువగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. క్రయవిక్రయాలు సానుకూలంగా ఉంటాయి. ప్రేమలు ఫలిస్తాయి. మనసొక చోట శరీరం మరో చోట ఉంటుంది. విశ్రాంతి, వినోదాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఎరుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఎదుటివారితో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే రహస్యాలను బయటికి చెప్పే అవకాశాలున్నాయి. ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. ఒడిదుడుకులను సరిచేసుకునే ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వాహన యోగం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. సహోదోగ్యులతో విభేదాలు రావొచ్చు. పనిఒత్తిడి పెరుగుతుంది. ఆశించిన రీతిలో సెలవులు ఉండవు. విద్యార్థినీ విద్యార్థులకు సాధారణమైన ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంటుంది. ఎగుమతి, దిగుమతుల వ్యాపారాలు చేసేవారికి, లాయర్లకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఎదుటివారు ఏం మాట్లాడినా పాజిటివ్ గా స్వీకరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారితో ఏం మాట్లాడినా అపార్థం చేసుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. వాహన మరమ్మతులు ఉండొచ్చు. ఎవరేమన్నా వినీ విన్నట్టుగా వదిలేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. తగాదాలు ఏర్పడే సూచనలున్నప్పడు నేర్పరిగా వ్యవహరిస్తారు. దృష్టిదోషం పెరుగుతుంది. సంతానం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రిజిస్ట్రేషన్లు వాయిదా పడొచ్చు. శ్రమ ఎక్కువ, ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. మీ వైపు నుండి చిన్నపాటి తప్పులు కూడా లేకుండా ఉంటే.. అన్నిరకాలుగా కలిసివస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఉద్యోగ అవకాశాలకు అనుకూలంగా ఉంటుంది. భూ క్రయవిక్రయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు మినహా అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియక సతమతమవుతారు. సంతకాలకు విలువ ఉన్న ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
Next Story