Sat Jan 11 2025 07:08:09 GMT+0000 (Coordinated Universal Time)
DECEMBER 23 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివృత్తులు, అన్ని వయసులవారు, అన్ని వర్గాల వారు జాగ్రత్తగా ఉండాలి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, శుక్రవారం
తిథి : మార్గశిర అమావాస్య మ.3.46 వరకు
నక్షత్రం : మూల రా.1.13 వరకు
వర్జ్యం : మ.11.06 నుండి 12.31 వరకు, రా.11.46 నుండి 1.13 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.48 నుండి 9.32 వరకు, మ.12.29 నుండి 1.13 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : మ.3.00 నుండి 4.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఊరట, ప్రశాంతత లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఏ పని పూర్తి చేయాలన్నా కష్టపడాల్సి ఉంటుంది. ఎదుటివారిచ్చిన మాట నిలబెట్టుకోరు. ఇంటర్వ్యూలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరంగానూ జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఇంటర్వ్యూలలో సక్సెస్ అవుతారు. చర్చలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. చర్చలు ఫలిస్తాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా పూర్తవుతాయి. సంఘ గౌరవం పెరుగుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు మంచికాలం. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. చిన్న చిన్న తగాదాలు, విభేదాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగ ప్రయత్నంపై పునరాలోచన చేయాలి. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివృత్తులు, అన్ని వయసులవారు, అన్ని వర్గాల వారు జాగ్రత్తగా ఉండాలి. అందంపై మమకారాన్ని పెంచుకుంటారు. వృథా ఖర్చులుంటాయి. వాహన మరమ్మతులు ఎదురవుతాయి. శత్రుబలం, దృష్టిదోషం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలమైన కాలం. నూతన విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. కాంప్లిమెంట్స్ అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. మాట పట్టింపులు చోటుచేసుకుంటాయి. ఇంట, బయట అర్థం చేసుకునేవారు తక్కువగా ఉంటారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. పాత మిత్రులను తిరిగి కలుస్తారు. మీపై నమ్మకం ఏర్పడుతుంది. ఆశించిన రుణాలను అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం ఒడిదుడుకులుగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. పనుల విషయంలో సందిగ్ధత, అయోమయం నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా, ఉద్యోగ, వ్యాపారాల పరంగా, విద్య పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
Next Story