Sat Dec 28 2024 02:28:14 GMT+0000 (Coordinated Universal Time)
DECEMBER 26 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఇంట, బయట సహకరించే..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, సోమవారం
తిథి : శు.చవితి తె.1.37 వరకు
నక్షత్రం : శ్రవణం సా.4.42 వరకు
వర్జ్యం : రా.8.19 నుండి 9.46 వరకు
దుర్ముహూర్తం : మ.12.30 నుండి 1.14 వరకు, మ.2.42 నుండి 3.26 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి మ.12.00 వరకు
శుభ సమయాలు : సా.4.50 నుండి 5.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు గడిచిపోయిన సంఘటనలను గుర్తుచేసుకుంటారు. పనిచేసే ప్రాంతంలో సహ ఉద్యోగులు మీ సహాయాన్ని కోరుతారు. ఆర్థికపరంగా ఒడిదుడుకులుంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత తక్కువగా మాట్లాడటం మంచిది. లాయర్, టీచర్ వృత్తుల్లో వారు, విద్యార్థినీ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. వాహనయోగం ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పని ఆటంకాలతో కూడుకుని ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. పనులు ఒత్తిడితో ఉంటుంది. శరీరం అలసిపోతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఎదుటివారితో జరిపే చర్చల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యాపారస్తులకు రొటేషన్లు సానుకూలంగా సాగుతున్నాయి. ఒళ్లునొప్పులు బాధిస్తాయి. విహార యాత్రలు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఫైనాన్షియల్ గా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో వెసులుబాటు లభిస్తుంది. ప్రతి విషయాన్ని నిదానంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. దూరప్రాంత ప్రయాణాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలతో కూడుకుని ఉంటుంది. ఆశించినంత ధనం రాకపోవడంతో నిరుత్సాహపడతారు. శత్రుబలం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా కీలక నిర్ణయాలకు అనుకూలం కాదు. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఇంట, బయట సహకరించే వర్గం చేరువలో ఉంటారు. ఎక్కువగా ఆలోచిస్తారు కానీ.. సరైన పరిష్కారం లభించదు. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. తగాదా పడితే తప్ప పనులు జరగవనుకుంటే.. నిర్మొహమాటంగా వ్యవహరిస్తారు. మనసుకి నచ్చినవిధంగా నడుచుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువ. మీరు చెప్పేది ఒకటి.. ఎదుటివారు అర్థం చేసుకునేది మరొకటిగా ఉంటుంది. ఇంట, బయట అపార్థాలు రాజ్యమేలుతాయి. దృష్టిదోషం అధికంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉన్నా.. ఉపకరిస్తాయి. నిరుత్సాహం ఎదురైనా.. ఎంతవరకూ మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే తగాదాలను తీర్చే ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఎదుటివారిని అంచనా వేయడంలో విఫలమవుతారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. ఒళ్లునొప్పులు బాధిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా కలసివస్తుంది. నిరుద్యోగులు ఒక ప్రయత్నంతోనే సానుకూల ఫలితాలు అందుకుంటారు. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు కలసివస్తాయి. క్రయవిక్రయాలు సానుకూలంగా కొనసాగుతాయి. అపార్థాలు తొలగుతాయి. శత్రుబలం తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story