Fri Dec 27 2024 10:36:45 GMT+0000 (Coordinated Universal Time)
DECEMBER 29 : నేటి పంచాగం, నేడు ఈ రాశుల వారికి తిరుగుండదు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహం లభిస్తుంది. సంతానం వల్ల ఆనందాన్ని పొందుతారు. ఒక మెట్టు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, గురువారం
తిథి : శు.సప్తమి రా.7.17 వరకు
నక్షత్రం : పూర్వాభాద్ర మ.11.44 వరకు
వర్జ్యం : రా.9.12 నుండి 10.47 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.19 నుండి 11.03 వరకు, మ.2.44 నుండి 3.28 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.3.50 నుండి 4.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఎక్కువగా శ్రమిస్తారు. అలసట పెరుగుతుంది. ఎదుటివారితో ఉన్న లావాదేవీలను వెంటనే పూర్తిచేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. వాయిదా పడే పనుల్లో ఇబ్బందులు తప్పవు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందులో అనుభవం, ప్రావీణ్యం ఉంటుందో అందులో ఉండటమే మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు సానుకూలంగా ఉన్నాయి. వాయిదా పడుతూ వస్తోన్న పనులు సక్సెస్ అవుతాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. భాగస్వామ్య వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి. మంచి వైద్యం తీసుకుంటారు. సోదరుల మధ్య తగాదాలు పరిష్కారమవుతాయి. పొదుపుపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల పరంగా నూతన ఉత్సాహం కలుగుతుతుంది. స్కిల్స్ ను అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. క్రయవిక్రయాలు కలసివస్తాయి. ఆగిపోయిన పనులపై దృష్టిసారిస్తారు. విద్యార్థినీ, విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అనవసరమైన వివాదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. కష్టాన్ని నమ్ముకుని ముందుకెళ్తారు. అపార్థాలు చోటుచేసుకుంటాయి. దృష్టిదోషం పెరుగుతుంది. వేళకు నిద్రాహారాలు లోపిస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. సంఘ గౌరవం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక, ఆరోగ్యం, రహస్యాలు, కోర్టు కేసుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీరు చేసిన మేలు ఎదుటివారు గుర్తుంచుకోరు. అన్నిరంగాల వారు, అన్ని వయసుల వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. చర్చలు ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. గతంలో చోటుచేసుకున్న అపార్థాలను తొలగించుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. విద్యార్థినీ, విద్యార్థులకు, వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. పనులు వేగంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికంగా ఏర్పడిన ఒడిదుడుకుల నుండి బయటపడేందుకు కొత్తమార్గాలు లభిస్తాయి. దృష్టి దోషం పెరుగుతుంది. తగాదాలు పడక తప్పని చోటు కూడా ప్రయోజనం పొందుతారు. టీచర్లు, గాయకులకు అనుకూలంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ల కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. పొదుపుపై ఆలోచన చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహం లభిస్తుంది. సంతానం వల్ల ఆనందాన్ని పొందుతారు. ఒక మెట్టు పైకెదగాలనుకునేవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. దూరప్రయాణాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. శారీరక అలసట పెరుగుతుంది. సంతకాలు చేసేవిషయంలో, ఆర్థిక విషయాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకూ పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంది. క్రయవిక్రయాలు కలసివస్తాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. స్థిర, చరాస్థులపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలపై దృష్టిసారిస్తారు. అపార్థాలు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరిగినా.. ఉపయుక్తంగా ఉంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఎదుటివారిచ్చి పనులను సకాలంలో పూర్తిచేస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. కష్టాన్ని నమ్ముకుని ముందుకి సాగుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉత్సాహంతో ఉంటారు. సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. ఉపకరించే వర్గం చేరువలో ఉంటారు. ఇతరుల సలహాలు, సూచనలు అందుకుంటారు. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
Next Story