Sat Dec 28 2024 18:29:42 GMT+0000 (Coordinated Universal Time)
DECEMBER 2 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. శుభకార్యాల నిమిత్తం..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, శుక్రవారం
తిథి : శు.దశమి తె.5.39 వరకు
నక్షత్రం : ఉత్తరాభాద్ర తె.5.45 వరకు
వర్జ్యం : మ.3.20 నుండి 4.56 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.37 నుండి 9.22 వరకు, మ.12.19 నుండి 1.03 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.1.35 నుండి 2.25 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనిఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించుకునేందుకు ప్రయత్నించాలి. ఎదుటివారితో మాట్లాడేటపుడు సంయమనం పాటించడం మంచిది. ప్రయాణాలు కలసివస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సంఘ గౌరవం పెరుగుతుంది. మాటకు విలువనిస్తారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. శుభకార్యాలు ముడిపడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త ఆలోచనలు కలసివస్తాయి. నూతన పరిచయాలు ఉపకరిస్తాయి. ప్రేమలు ఫలిస్తాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మంచికాలం. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పెండింగ్ పనుల్లో కదలికలు ఏర్పడుతాయి. రిజిస్ట్రేషన్లు సానుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలపై దృష్టిసారిస్తే పరిష్కారం ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక స్థితిగతుల విషయంలో ఎంతజాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రిస్క్ తో కూడుకున్న పనుల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. శుభకార్యాల నిమిత్తం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచుకునేందుకు చేసే ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది. లౌక్యంగా మాట్లాడుతారు. ప్రతివిషయంలో ప్లాన్డ్ గా ముందుకు వెళ్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. చేసేపనిని అందరూ మెచ్చుకుంటారు కానీ.. సహకారం అందించరు. నా అనుకున్నవారే అర్థం చేసుకోకపోవడంతో నిరుత్సాహపడతారు. పనివేళలు పెరుగుతాయి. అంచనాలు తారుమారవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల పరంగా ఒత్తిడి పెరుగుతుంది. పరిచయాలు అంతంతమాత్రంగా ఉపకరిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగప్రయత్నాలు కలసివస్తాయి. ప్రతి విషయంలో మేలు జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఉపకరిస్తాయి. సంఘ గౌరవం పెరుగుతుంది. విద్యార్థినీ, విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తెగిపోయిన సంబంధాలు తిరిగి ముడిపడొచ్చు. అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి. నూతన ఉత్సాహం, ఆనందంతో ముందుకు వెళ్తారు. ఉద్యోగ,వ్యాపారాల్లో నిదానంగా లౌక్యంగా ఉండటంతో లాభాలు ఆర్జిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
Next Story