Fri Dec 27 2024 09:48:19 GMT+0000 (Coordinated Universal Time)
DECEMBER 30 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా సహకరిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. రోజంతా తీరికలేకుండా..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, శుక్రవారం
తిథి : శు.అష్టమి సా.6.33 వరకు
నక్షత్రం : ఉత్తరాభాద్ర మ.11.24 వరకు
వర్జ్యం : రా.11.36 నుండి 1.13 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.51 నుండి 9.35 వరకు, మ.12.32 నుండి 1.16 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.1.55 నుండి 2.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అపనిందలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయం కష్టంగా చేయాల్సి ఉంటుంది. ఆర్థికపరంగా జాగ్రత్తగా మెలగాల్సిన రోజు. గడిచిపోయిన కాలంలో జరిగిన సంఘటనలకు.. ఈరోజు సమాధానాలు చెప్పాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అతి కష్టంమీద పనులు సానుకూలమవుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. సంతానానికి సంబంధించిన విషయాలు ఆనందాన్నిస్తాయి. సంఘగౌరవం పెరుగుతుంది. సంతకానికి విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కష్టం పెరుగుతుంది. పనులు కష్టంగా పూర్తవుతాయి. రాశ్యాధిపతైన బుధుడు అష్టమంలో సంచరిస్తున్న కారణంగా.. అనవసరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ని వయసులవారు, అన్ని వృత్తులవారు ఈరోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారస్తులకు ఈ రోజు నూతన అవకాశాలు కలసివస్తాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. శుభవార్తలను అందుకుంటారు. విదేశీయాన ప్రయత్నాలకు ఆటంకాలు తొలగిపోతాయి. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు అన్నివిధాలా కలసివస్తుంది. చిన్న చిన్నవిషయాలను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో విజయాలు అందుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు. క్రయవిక్రయాల అంశాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన వెసులుబాటు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. పార్ట్ టైమ్ ఉద్యోగులకు అనుకూలం. ఎవరేమనుకున్నా.. మనసుకు నచ్చినట్లు ముందుకెళ్తారు. సంతకాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా సహకరిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. రోజంతా తీరికలేకుండా గడుపుతారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. గతంలో మరిచిపోయిన పనులను తిరిగి గుర్తుచేసుకుంటారు. ఆగిపోయిన పనులు, చదువులను పునః ప్రారంభించే దిశగా యోచన చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయం కాస్త తగాదాలతో కూడుకుని ముందుకెళ్తుంది. కోర్టు కేసుల విషయాలు సానుకూలమవుతాయి. కొనుగోళ్లపై దృష్టిసారిస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. భార్యభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు చోటుచేసుకుంటాయి. దృష్టిదోషం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిదానమే ప్రధానంగా ముందుకి సాగుతారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. మానసికంగా, శారీరకంగా ప్రశాంతత లభిస్తుంది. వైద్య సలహాలు, సూచనలు కలసివస్తాయి. భవిష్యత్ పై దృష్టిసారిస్తారు. రిస్క్ తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. అర్థం చేసుకోవడంలేదన్న భావన పెరుగుతుంది. క్రిమినల్ లాయర్లు, సర్జన్లకు కలసివస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంచనాలు తారుమారవుతాయి. పనుల్లో వేగాన్ని పెంచాలని ఎదుటివారు ఒత్తిడి చేస్తారు. క్రయవిక్రయాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది. నిదానమే ప్రధానంగా వ్యవహరించడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ప్రతి సమస్యలో నుండి బయటపడేందుకు మార్గాలు సుగమమవుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. నచ్చినవారితో సమయం గడుపుతారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
Next Story