Sat Dec 28 2024 18:00:28 GMT+0000 (Coordinated Universal Time)
DECEMBER 3 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘ గౌరవం పెరుగుతుంది. సమస్యల పరిష్కారానికి కొత్త అవకాశాలు లభిస్తాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, శనివారం
తిథి : శు.ఏకాదశి తె.5.34 వరకు
నక్షత్రం : రేవతి తె.6.16 వరకు
వర్జ్యం : సా.6.01 నుండి 7.39 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.25 నుండి 7.53 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.45 నుండి 11.35 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొన్ని పనులు వాయిదా పడొచ్చు. విద్యార్థినీ, విద్యార్థులకు శ్రద్ధ తగ్గుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ఉద్యోగప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. ఎదుటివారి సహాయ సహకారాలు అందుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉపాధ్యాయ వృత్తుల్లో ఉన్నవారికి యోగదాయకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక సంతృప్తినిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. క్రయవిక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. ఎదుటివారికి సలహాలిచ్చి చెడ్డవారయ్యే అవకాశాలున్నాయి. వైద్య సంప్రదింపులు తప్పకపోవచ్చు. గౌరవ, మర్యాదలు తగ్గొచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడి ఎక్కువగా ఉన్నా తగిన ఫలితాలుంటాయి. నూతన పరిచయాలు ఉపకరిస్తాయి. అప్పులు తీర్చుకునేందుకు ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘ గౌరవం పెరుగుతుంది. సమస్యల పరిష్కారానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. శత్రుబలం తగ్గుతుంది. లాయర్లతో జరిపే సంప్రదింపులు సానుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగు జాగ్రత్తలు పాటించాలి. అపార్థాలు ఎక్కువగా ఉంటాయి. దృష్టిదోషం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో చిన్నచిన్న తగాదాలు సహజం. ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉత్సాహం లోపిస్తుంది. ఆర్థికస్థితిగతుల్లో మార్పులుండవు. వ్యాపారస్తులు నష్టపోయే అవకాశాలున్నాయి. విద్యార్థినీ, విద్యార్థులకు సాధారణ ఫలితాలుంటాయి. పనులు వాయిదా పడుతుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. పనులు విజయవంతంగా పూర్తవుతాయి. క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు పూర్తవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. సంతకానికి విలువ పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story