Mon Dec 23 2024 06:24:50 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, డిసెంబర్ 4 నుండి డిసెంబర్ 10 వరకు ద్వాదశ రాశుల వారఫలాలు, పరిహారాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత రుతువు, మార్గశిర మాసం, ఆదివారం
తిథి : శు.ద్వాదశి తె.5.57 వరకు
నక్షత్రం : అశ్వని పూర్తిగా
వర్జ్యం : రా.3.05 నుండి 4.45 వరకు
దుర్ముహూర్తం : సా.4.01 నుండి 4.46 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.8.30 నుండి 9.25
నవగ్రహ సంచారం
మేషం -రాహువు
వృషభం - కుజుడు వక్రగతిలో
తుల - కేతువు
వృశ్చికం - రవి
వృశ్చికం,ధనస్సు -శుక్రుడు
ధనస్సు-బుధుడు
మకరం - శని
మీనం-గురువు
చంద్రగ్రహ సంచారం
మీనం, మేషం, వృషం, మిథున
డిసెంబర్ 4 నుండి డిసెంబర్ 10 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక వెసులుబాటులు ఉంటాయి. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. పరోపకారం పెరుగుతుంది. బెటర్ జాబ్స్, ఇంక్రిమెంట్లకు సానుకూలంగా ఉంటుంది. రహస్యమైన వ్యూహాలను అమలు చేస్తారు. న్యాయపరమైన సమస్యలు తీరుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం సోమ, శుక్ర,శనివారాలు అనుకూలంగా ఉంటాయి. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు అధికమవుతాయి. ఎదుటివారికి మంచి చేసిన మాటపడతారు. ఉద్యోగమార్పు మంచిది కాదు. కుటుంబ సభ్యులతో అభిప్రాయబేధాలు రావొచ్చు. కొత్తవిషయాలపై దృష్టిసారించేందుకు మంచిది కాదు. ఎవరినీ గుడ్డిగా నమ్మరాదు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం బుధ,గురువారాలు అనుకూలంగా ఉంటాయి. శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నష్టాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మినవారే మోసం చేస్తారు. ఇంట్లో ఉన్నవారు కూడా అపార్థం చేసుకోవచ్చు. అనారోగ్య సమస్యలు పెరగవచ్చు. ప్రతి విషయంలో నిదానంగా వ్యవహరించడం మంచిది ఈ వారం ఆది, సోమ, శుక్ర, శనివారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. ఉద్యోగ మార్పులకు, ఉద్యోగ ప్రయత్నాలకు, శుభకార్యాలకు ఈవారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈవారం ఆది,సోమ, మంగళ, బుధ, గురువారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం మంచిది.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ప్రతి పనికీ అధికంగా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులను అదుపులో పెట్టగలుగుతారు. సమస్యలను పరిష్కరిస్తారు. ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకుంటారు. ఈ వారం బుధ, గురు,శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఆదిత్యహృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా కలసివస్తుంది. గతంకన్నా మెరుగైన ఫలితాలుంటాయి. శత్రుబలం తగ్గుతుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. తెలియని మానసిక ఆందోళన వెంటాడుతుంది. రహస్య శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా లాభాలుంటాయి. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి. ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ప్రతివిషయంలో లౌక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపార పరంగా బిజీగా ఉంటారు. ఎదుటివారు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. ఉచిత సలహాలివ్వడం మంచిది కాదు. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతాయి. శత్రుబలం, దృష్టిదోషం పెరుగుతుంది. న్యాయపోరాటం చేస్తారు. దంపతుల మధ్య తగాదాలు పెరుగుతాయి. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను వీలైనన్ని సార్లు పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా కాలం కలసివస్తుంది. ఇతరులకు నచ్చజెప్పే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆపరేషన్లు సక్సెస్ అవుతాయి. రిజిస్ట్రేషన్లు ముందుకు సాగుతాయి. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ, వ్యాపార, కాంట్రాక్ట్ రంగంలోవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఇంచుమించుగా అన్నిరోజులూ అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం మంచిది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం మంగళవారం నుండి శుక్రబలం యోగిస్తుంది. వృథా ఖర్చులు అధికమవుతాయి. అన్నివిషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తగాదాలు, విభేదాలు చోటుచేసుకుంటాయి. అపార్థాలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం బుధ, గురు,శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయాలి.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల పరంగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం కాదు. సమస్య వెనుక సమస్యలు వస్తుంటాయి. వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శుభకార్యాల ప్రయత్నాలు కొనసాగుతుంటాయి. అప్పులు చేస్తారు. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రం, శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు రొటేషన్లలో అవాంతరాలు సమసిపోతాయి. శుభకార్యాల ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అన్నిరంగాల వారికి అనుకూలంగా ఉంటాయి. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పఠించడం మంచిది.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అన్నిరంగాల వారు జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాలు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వైద్య సంప్రదింపులు జరుగుతాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. శత్రుబలం పెరుగుతుంది. దృష్టిదోషం అధికంగా ఉంటుంది. ఈ వారం బుధ, గురువారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ సంకష్ఠహర స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story