Sat Dec 28 2024 18:11:09 GMT+0000 (Coordinated Universal Time)
DECEMBER 5 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. దంపతుల మధ్య చిన్నపాటి తగాదాలు చోటుచేసుకుంటాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, సోమవారం
తిథి : శు. త్రయోదశి పూర్తిగా
నక్షత్రం : అశ్వని ఉ.7.15 వరకు
వర్జ్యం : సా.5.24 నుండి రా.7.06 వరకు
దుర్ముహూర్తం : మ.12.20 నుండి 1.04 వరకు, మ.2.33 నుండి 3.17 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి మ.12.00 వరకు
శుభ సమయాలు : మ.3.50 నుండి 4.20 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. క్రయవిక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థినీ విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధికమవుతాయి. ఊహించని పనులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. అంచనాలు తారుమారవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మంచి సమయం కాదు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుటివారికి నచ్చజెప్పే ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ప్రయాణాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడి అధికంగా ఉంటుంది. రహస్య శత్రువుల వలన ఇబ్బందులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. నిర్ణయాలు స్థిరంగా ఉండవు. ఇష్టంలేనివారిపై మీ వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు. ఖర్చులు అధికమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిదానమే ప్రధానంగా ముందుకు సాగాలి. వ్యక్తిగత విషయాలను ఇతరులతో చర్చించకపోవడం మంచిది. అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ఖర్చులుంటాయి.సహాయపడే వారు తక్కువ. దంపతుల మధ్య అన్యోన్యత ఆనందాన్నిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలసివస్తాయి. సంతాన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కళా, సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థినీ, విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. స్థిర చరాస్థులపై దృష్టిసారిస్తారు. ఉద్యోగులు, ఇరుగుపొరుగువారితో ఏర్పడిన బేధాభిప్రాయాలు తొలగుతాయి. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. చర్చలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకున్నది ఒకటి.. జరిగేది మరొకటిగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఒంటరిగా ఉన్నామన్న భావన ఏర్పడుతుంది. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. దంపతుల మధ్య చిన్నపాటి తగాదాలు చోటుచేసుకుంటాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఒళ్లు నొప్పుల వంటి సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. అప్పులను వసూలు చేసే ప్రయత్నాలు ఫలితాలుంటాయి. బ్యాంక్ రుణప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. రోజంతా తీరిక లేకుండా గడిచిపోతుంది. ఎదుటివారిని అంచనా వేయడంలో విఫలమవుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తారు. వివాహ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story