Sat Dec 28 2024 18:36:51 GMT+0000 (Coordinated Universal Time)
DECEMBER 8 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. విహార, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, గురువారం
తిథి : మార్గశిర పూర్ణిమ ఉ.9.37 వరకు
నక్షత్రం : రోహిణి మ.12.33 వరకు
వర్జ్యం : సా.6.43 నుండి 8.29 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.09 నుండి 10.53 వరకు, మ.2.34 నుండి 3.18 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : మ.3.40 నుండి 4.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. పనివేళలు పెరుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువ. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. సహకరించే వారు తక్కువగా ఉంటారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమలు, శుభకార్యాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలమైన ఫలితాలుంటాయి. పూర్తికావనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అప్పులను వసూలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్య,భర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అధికారుల మెప్పు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలపై దృష్టిసారిస్తారు. కొత్త అవకాశాలు కలసివస్తాయి. ఆర్థిక విషయాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆవేశం పెరుగుతుంది. తప్పులేకున్నా మాటపడాల్సిన అవకాశం ఉంటుంది. పనులు వాయిదా పడుతాయి. వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఎవరూ అర్థం చేసుకోవడం లేదన్న ఆవేదన పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. విహార, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రయవిక్రయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. పాత అప్పులు తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి.పెట్టుబడులు ఉపకరిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసేవారి సంఖ్య పెరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో తొందరపాటు తగదు. రహస్యాలను ఎవరికీ చెప్పకపోవడం మంచిది. ఉద్యోగ, వ్యాపారాల్లో సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సానుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. నూతన ఆలోచనలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఉపకరిస్తాయి. అప్పులను తీరుస్తారు. ఉద్యోగ మార్పులు మంచిది కాదు. పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
Next Story