Mon Dec 23 2024 06:57:32 GMT+0000 (Coordinated Universal Time)
DHANTERAS : అక్టోబర్ 23 నుంచి 29 వరకూ వారఫలాలు, పరిహారాలు
DHANTERAS : ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉండదు. ఆదాయం-ఖర్చులు సమానంగా ఉంటాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం, ఆదివారం
తిథి : బ.త్రయోదశి సా.6.03 వరకు
నక్షత్రం : ఉత్తర మ.2.34 వరకు
వర్జ్యం : రా.11.01 నుండి 12.38 వరకు
దుర్ముహూర్తం : సా.4.06 నుండి 4.52 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : లేవు
ఈవారం నవగ్రహ సంచారం
మేషం - రాహువు
మిథునం - కుజుడు
కన్య,తుల - బుధుడు
తుల - రవి, శుక్రుడు, కేతువు
మకరం -శని వక్రగతిలో
మీనం - గురువు వక్రగతిలో
చంద్రగ్రహ సంచారం
కన్య, తుల, వృశ్చిక రాశులలో..
ఈ గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలనిస్తుందో తెలుసుకుందాం..
అక్టోబర్ 23 నుంచి 29 వరకూ వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూలించే గ్రహాల సంఖ్య తక్కువగా ఉంది. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అధికారుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. శుభకార్యాలపై జరిపే చర్చలు ఫలిస్తాయి. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం, శివకవచాన్ని పారాయణ చేయడం మంచిది.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉండదు. ఆదాయం-ఖర్చులు సమానంగా ఉంటాయి. కొత్తగా అప్పులు చేస్తూ పాత అప్పులను తీరుస్తారు. శత్రుబలం పెరుగుతుంది. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి ఈవారం అనుకూలంగా ఉంది. నూతన గృహం, వాహనాన్ని కొనుగోలు చేసే ఆలోచనలు బలపడుతాయి. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లాభాలకన్నా నష్టాలకే అవకాశాలు ఎక్కువ. ఒడిదుడుకులు అధికమవుతాయి. నిదానమే ప్రధానంగా సాగిపోవాలి. బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ఉపయోగపడే ఖర్చులుంటాయి. మంచిరోజులు వస్తున్నాయి. ఉద్యోగంలో కీలక మార్పులుండవచ్చు. పంతం నెగ్గించుకుంటారు. కోర్టుకేసులు ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఆది, సోమ, శనివారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం గ్రహగతులు యోగిస్తున్నాయి. పనులు నిదానంగా కొనసాగుతాయి. రావలసిన నగదు చేతికి అందేందుకు సమయం పడుతుంది. విదేశీయాన ప్రయత్నాలు కలసివస్తాయి. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ వారం మంగళ, బుధవారాలు కలసివస్తాయి. శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం గ్రహగతులు సానుకూలంగా కొనసాగుతున్నాయి. ప్రశాంతంగా ఉంటారు. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి-ఉద్యోగాల్లో ఒత్తిడులను ఎదుర్కొంటారు. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. ఈ వారం ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి. దుర్గాఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలుంటాయి.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం గ్రహగతులు సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. కోపం పెరుగుతుంది. తగాదాలు ఏర్పడవచ్చు. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. జీవిత భాగస్వామి సహాయం అందుతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం మంగళ, బుధ, శనివారాలు అనుకూలిస్తాయి. సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రతి విషయంలోనూ తగాదా ఏర్పడుతుంది. శాంతంగా ఉండేవారిలో వచ్చే ఆవేశం ఎదుటివారిని ఆశ్చర్య పరుస్తుంది. ఆర్థిక విషయాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ వారం ఉన్నదానితో సరిపెట్టుకోవడం మంచిది. ఈ వారం ఆది, సోమ, గురు, శుక్రవారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం గ్రహగతులు అన్నివిధాలా యోగిస్తున్నాయి. ఆర్థికపరంగా వెసులుబాటు లభిస్తుంది. తగాదాలున్నా.. గెలుస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా మంచి ఉన్నతమైన స్థానాన్ని అందుకుంటారు. ప్రతిపనిలో విజయం సిద్ధిస్తుంది. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధ, శనివారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ దశరథకృత శనిస్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం పనులు అతికష్టంమీద సానుకూలమవుతాయి. బంధువులతో విభేదాలు తప్పవు. ఉద్యోగానికి రాజీనామా చేయడం మంచిది కాదు. వాహనయోగం ఉంది. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ దుర్గాఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలుంటాయి.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఎవరికోసం జీవిస్తున్నారన్న సందేహం కలుగుతుంది. ఆర్థికపరమైన పొదుపు కష్టమే. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురు, శుక్ర, శనివారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పనులు వాయిదా వేయడం మంచిది కాదు. సంతానంతో తగాదాలు తప్పకపోవచ్చు. ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. ఈ వారం ఆది, సోమ, శనివారాలు అనుకూలిస్తాయి. ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
Next Story