Thu Dec 26 2024 06:04:14 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 10 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఏ పనీ పూర్తి చేసే అవకాశం లేదు. లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు సరిసమానంగా ఉంటాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్రవారం
తిథి : బ.చవితి ఉ.7.58 వరకు
నక్షత్రం : హస్త రా.12.18 వరకు
వర్జ్యం : ఉ.7.30 నుండి 9.13 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.56 నుండి 9.42 వరకు, మ.12.45 నుండి 1.30 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.2.00 నుండి 2.30 వరకు, సా.4.50 నుండి 5.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలు సానుకూలంగా ఉంటాయి. క్రయవిక్రయాలు లాభపరుస్తాయి. రిజిస్ట్రేషన్లు అనుకూలంగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. అర్థం చేసుకునేవారి సంఖ్య తగ్గుతుంది. ఉద్యోగ, వ్యాపారపరంగా ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిభా పాఠవాలను ఎదుటివారు గుర్తించలేరు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనీ కష్టంగా ఉంటుంది. పూర్తవుతాయనుకున్న పనులు నిరాశ పరుస్తాయి. ఆత్మీయులతో కలిసి కాలక్షేపం చేస్తారు. శుభవార్తలు వింటారు. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. సమస్యలను పరిష్కరించుకునేందుకు చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. నడుం నొప్పి, కాళ్ల నొప్పులు, అజీర్ణ సమస్యలు బాధిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కొత్తపెట్టుబడులపై దృష్టి సారిస్తారు. బంగారాన్ని తాకట్టు పెట్టకపోవడం శ్రేయస్కరం. నమ్మకద్రోహం జరగవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఏ పనీ పూర్తి చేసే అవకాశం లేదు. లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు సరిసమానంగా ఉంటాయి. వ్యాపారస్తులు పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత స్థాయి ఉద్యోగులకు నిర్ణయాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్షణం తీరిక లేదు.. పైసా ఆదాయం ఉండదు అన్న చందంగా ఉంటుంది. ఆహారం తీసుకునే సమయం కూడా ఉండక ఇబ్బంది పడతారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. మనసులో ఉన్న మాట ఎవరితోనూ చెప్పకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గౌరవ, మర్యాదలు లభిస్తాయి. పరిచయాలు విస్తరిస్తాయి. బహుమతులు అందుకుంటారు. నిద్ర, బద్ధకం పెరిగే అవకాశాలున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల పరంగా తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. ఇంట్లో కన్నా బయట ఉంటేనే బాగుంటుందన్న చందంగా ఉంటుంది. జీవితంలో బాగా కష్టపడాలన్న ఆలోచనలు బలపడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులన్నీ వాయిదా పడుతుంటాయి. ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. ఎదుటివారు మీ మాట వినే అవకాశాలు తక్కువ. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. పనులైతే మేలు కలుగుతుందన్న నమ్మకం ఉంటుంది కానీ.. అవి ఎలా పూర్తిచేయాలో తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్నవారితో ముఖాముఖి తేల్చుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. అన్నివృత్తులు, అన్ని వయసుల వారికి ఈరోజు అనుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story