Mon Dec 23 2024 02:17:59 GMT+0000 (Coordinated Universal Time)
WEEKLY HOROSCOPE : నేటి పంచాంగం, ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 18 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నూతన ఉద్యోగ..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, మాఘ మాసం, ఆదివారం
తిథి : బ.షష్ఠి ఉ.9.45 వరకు
నక్షత్రం : స్వాతి తె.2.27 వరకు
వర్జ్యం : ఉ.7.27 నుండి 9.06 వరకు
దుర్ముహూర్తం : సా.4.34 నుండి 5.19 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : మ.2.50 నుండి 3.30 వరకు
నవగ్రహ సంచారం
మేషం -రాహువు
వృషభం - కుజుడు
తుల - కేతువు
మకరం, కుంభం - రవి
మకరం - బుధుడు
కుంభం, మీనం - శుక్రుడు
కుంభం - శని
మీనం -గురువు
చంద్రగ్రహ సంచారం
తుల, వృశ్చికం, ధనస్సు, మకరం
ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 18 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక ఒడిదుడుకల నుండి బయటపడే అవకాశాలు ఏర్పడుతాయి. విశ్రాంతికి దూరంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలు సానుకూలంగా సాగుతాయి. కానీ.. ప్రతి పనీ టెన్షన్ తో పూర్తవుతుంది. ప్రశాంతత తగ్గుతుంది. ఈ వారం ఆది, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీలైనన్నిసార్లు పారాయణ చేయడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఊరట లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ప్రేమలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. వాహనయోగం ఉంటుంది. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. నేర్పుగా ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటారు. ఇష్టమైన పనులను చేస్తారు. వేళకు నిద్రాహారాలు అందుతాయి. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రూపాయి వచ్చే మార్గాన్ని వదిలిపెట్టరు. రవిబలం తక్కువగా ఉండటంతో.. మీ ఆలోచనలు ఎదుటివారికి నచ్చవు. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఎదుటివారి అపార్థం చేసుకుంటారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వారం ఆది,సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఎదుటివారికి సహాయం చేసి.. ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. మాటఇవ్వడం, షూరిటీ సంతకాలకు దూరంగా ఉండటం మేలు. అనుకోని ఖర్చులు ఏర్పడుతాయి. ప్రతి పనీ చేయలేక ఇబ్బంది పడతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. అంచనాలు తారుమారవుతాయి. ఈ వారం ఆది, శనివారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రుబలం తగ్గుతుంది. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సూత్రాలను పాటించడంపై ఆసక్తి చూపుతారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడుల నుండి ఉపశమనం ఉంటుంది. స్థిర, చరాస్తుల కొనుగోళ్ల విషయాల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. నిరుత్సాహానికి దూరంగా ఉంటారు. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులుఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువులకు ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. ఎవరికీ సలహాలివ్వకుండా, ఎవరివద్ద సలహాలు తీసుకోకుండా ఉండటం మేలు. మనస్సుకు నచ్చిన విధంగా మసులుకోవడం మంచిది. ఆర్థిక పరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఏం చేయాలనుకున్నా యథాతథంగా చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. చికాకు, కోపం, ఆవేశం రాకుండా చూసుకోవాలి. తక్కువగా మాట్లాడటం మంచిది. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. ఈ వారం ఆది,గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం విశ్రాంతి తగ్గుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఒత్తిడులు పెరుగుతాయి. పాత పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఎదుటివారికి సమయం కేటాయించకపోవడంతో అపార్థం చేసుకుంటారు. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా లాభనష్టాలు ఉండవు. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్ని సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార సంబంధిత విషయాల్లో క్రిస్టల్ క్లియర్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతోన్న స్త్రీలకు ఊరట కలుగుతుంది. ప్రతి విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉంటారు. ఈ వారం ఆది, గురు, శుక్రవారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. ఇంట్లో ఉండేందుకన్నా బయట తిరిగేందుకు అవకాశాలు కల్పించుకుంటారు. ఏ ఉద్యోగం దొరికితే ఆ ఉద్యోగంలో చేరడం మంచిది. కోర్సులు చేసేవారు ఉన్నదానిలో సంతృప్తి చెందాలి. విదేశీయాన ప్రయత్నాలు చేసేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సందిగ్ధంగా ఉన్న విషయాల్లో స్పష్టత వస్తుంది. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆగ్రహం కంట్రోల్ తప్పుతుంది. ఇంట్లో ఉన్న పెద్దవారితో వాగ్వివాదం చోటుచేసుకుంటుంది. పిత్రార్జితాన్ని అమ్మితే ఇబ్బందులు తప్పవు. అన్నదమ్ముల మధ్యనున్న తగాదాలు, విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వినాయకుడిని పూజించడంతో మంచి ఫలితాలు పొందవచ్చు.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పుద్రోవ పట్టించేవారు పక్కనే ఉంటారు. కీలకమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు పాటించడం మంచిది. జీరో రిస్క్ పనులపై మాత్రమే దృష్టి సారించడం మంచిది. ప్రేమలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు సానుకూలంగా ఉంటాయి. రహస్య శత్రువులు పెరుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story