Wed Dec 25 2024 17:37:53 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 13 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, సోమవారం
తిథి : బ.సప్తమి ఉ.9.45 వరకు
నక్షత్రం : విశాఖ తె.2.36 వరకు
వర్జ్యం : ఉ.8.05 నుండి 9.42 వరకు
దుర్ముహూర్తం : మ.12.45 నుండి 1.30 వరకు, మ.3.02 నుండి 3.48 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : సా.4.00 నుండి 4.47 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లకు, అధికారులతో సంప్రదింపులకు యోగదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. క్రయవిక్రయాలు కలసివస్తాయి. వివాహాది శుభకార్యాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అప్పులివ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. అధికారులతో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. మంచి చెప్పి చెడ్డవారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఫైనాన్స్ రంగం వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. కొనుగోళ్లపై దృష్టి సారిస్తారు. ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే దానిపట్ల ఆసక్తి చూపుతారు. మీ ప్రశాంతతపై దృష్టిసారిస్తారు. పెండింగ్ బిల్స్ క్లియర్ అవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవాలి. ఇంట్లో ఉన్న పెద్దవారి ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ, వ్యాపార సంబంధిత అంశాలు ముందంజలో కొనసాగుతాయి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువగా ఫలితాలు తక్కువగా ఉంటాయి. ప్రయాణాలు చేస్తారు. మొహమాటానికి పనులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం తర్వాతి నుంచి వ్యతిరేక ఫలితాలు రావొచ్చు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సేవింగ్స్ పై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా కాలం అనుకూలంగా ఉంటుంది. అధికారుల నుంచి వచ్చే ఒత్తిడులు తగ్గుతాయి. గొంతు సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గోల్డ్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఎంతో శ్రమపడితే తప్ప పనులు సానుకూలపడవు. సేవింగ్స్ లేవన్న మాట పక్కనపెడితే.. పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తప్పవనుకున్న పనులపై మాత్రమే దృష్టిని సారించడం మంచిది. తల్లితరపు బంధువులతో తగాదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
Next Story