Wed Dec 25 2024 17:47:39 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 15 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారితో ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, బుధవారం
తిథి : బ.నవమి ఉ.7.39 వరకు, బ.దశమి తె.5.32 వరకు
నక్షత్రం : జ్యేష్ఠ రా.12.46 వరకు
వర్జ్యం : ఉ.7.20 నుండి 8.51 వరకు
దుర్ముహూర్తం : మ.11.59 నుండి 12.45 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.00 నుండి 10.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు ఏమన్నా వినీ విననట్టుగా వదిలేయడం మంచిది. ఇతరులపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు వృత్తి, ఉద్యోగాలపై దృష్టిసారిస్తారు. మరింత అభివృద్ధిని సాధించేందుకు ఏం చేయాలని ఆలోచిస్తారు. సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేస్తారు. క్రయవిక్రయాల అంశాలు సానుకూలంగా సాగుతున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా సాగుతాయి. ఎగుమతి, దిగుమతుల వ్యాపారాలు చేసేవారికి, చాలాకాలంగా లాభాలకోసం చూస్తున్న వారికి అనుకూల ఫలితాలుంటాయి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. పాతపరిచయాలు బలపడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మంచికిపోతే చెడు ఎదురైందన్న చందన్న కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. ఏ పనిచేయాలన్నా రూపాయితోనే ముడిపడి ఉందన్న నిర్ణయానికి వస్తారు. ఇంట, బయట ఒత్తిడి పెరుగుతుంది. కష్టాలు, నష్టాలు ఉండవు కానీ.. చిరాకుగా ఉంటారు. అయినవారే అర్థం చేసుకోవట్లేదన్న మానసిక వ్యధ పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలు యోగదాయకంగా సాగుతున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. అంచనాలు తారుమారవుతాయి. ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచుకోవాలి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. భగవంతుడిపై భారం వేసి ఉండటం మంచిది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సానుకూల వాతావరణం ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవారితో సమస్యలను పరిష్కరించుకుంటారు. క్రయ,విక్రయాల అంశాల యోగదాయకంగా కొనసాగుతున్నాయి. ఇంటిలో, ఆఫీసులో బ్యాలెన్స్ గా వ్యవహరిస్తారు. తెలియని ఆందోళన వెంటాడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారితో ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది. ఎవరూ పట్టించుకోవడం లేదన్న భావజాలం పెరుగుతుంది. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. భార్య, భర్తల మధ్య తగాదాలు ఏర్పడుతాయి. స్థిర, చరాస్తుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహాన్ని కలిగిఉంటారు. 10 మందినీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తారు. కష్టేఫలి అన్న సూత్రాన్ని నమ్ముకుంటారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటారు. లౌక్యంగా వ్యవహరిస్తారు. శారీరక అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు దృష్టిదోషం తగ్గుతుంది. ఎదుటివారిని అంచనా వేస్తారు. పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ.. ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కోపం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలుంటాయి. ప్రతి పనిలో శుభాలు కలుగుతాయి. ఆర్థిక స్థితిగతులు ఊహించిన స్థాయిలో ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. క్షణం తీరికలేకుండా గడుపుతారు. మిమ్మల్ని మీరు బిజీగా చేసుకుంటారు. వాహనయోగం ఉంటుంది. పెట్టుబడులపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్నపాటి తగాదాలున్నా పరిష్కార మార్గాలను వెతుక్కుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు నిదానమే ప్రధానంగా వ్యవహరించాలి. పొగడ్తలకు దూరంగా ఉండాలి. క్రయవిక్రయాల అంశాలను వాయిదా వేయడం మంచిది. జీరో రిస్క్ పై ఉండాలి. పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
Next Story