Wed Dec 25 2024 17:45:24 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 16 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. మొండి బాకీలను వసూలు చేసుకునేందుకు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, గురువారం
తిథి : బ. ఏకాదశి తె.2.49 వరకు
నక్షత్రం : మూల రా.10.53 వరకు
వర్జ్యం : ఉ.8.08 నుండి 9.37 వరకు, రా.9.21 నుండి 10.53 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.27 నుండి 11.13 వరకు, మ.3.03 నుండి 3.49 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.30 నుండి 12.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. పనులు వేగాన్ని పుంజుకుంటాయి. మాట్లాడేటపుడు చాకచక్యంగా వ్యవహరిస్తారు. రాజకీయ రంగంవారికి మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తలు అవసరం. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీకు తెలియకుండానే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చిన్న గాయాలు తగలవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగ ఉన్నతి ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నిర్మొహమాటంగా వ్యవహరిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల పరంగా ఒత్తిడులు తగ్గుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఎదుటివారిచ్చే సలహాలు, సూచనలను ఆహ్వానిస్తారు. మీ ఇగోని హర్ట్ చేస్తే.. ఎవరన్నది చూడరు. కళా, సాహిత్య రంగాల్లోవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఊహాగానాలకు దూరంగా ఉండటం మంచిది. రోజంతా చికాకుగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. మొండి బాకీలను వసూలు చేసుకునేందుకు, పెండింగ్ బిల్స్ రాబట్టుకునేందుకు, కీలక నిర్ణయాలు తీసుకునేందుకు, అధికారులతో జరిపే సంప్రదింపులకు, వైద్యపరమైన అంశాలకు సానుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిదానమే ప్రధానమన్న చందంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఎటువంటి అంచనాలు నెరవేరే అవకాశాలు లేవు. ఒళ్లునొప్పులు ఇబ్బంది పెడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. పనులు వేగంగా పూర్తిచేయాలని భావిస్తారు. చురుగ్గా వ్యవహరిస్తారు. నూతనంగా ఆలోచిస్తారు. వినూత్న ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఇష్టంలేని పనులను మీ అభిప్రాయంతో సంబంధం లేకుండా చేయాల్సిన అవసరాలు ఏర్పడుతాయి. పని భారం పెరుగుతుంది. రోజులో ఉత్సాహం లోపిస్తుంది. వీలైనంత తక్కువగా మాట్లాడటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. చాలాకాలంగా పూర్తికాని పనులు పూర్తి అవుతాయి. విలువైన సమాచారాన్ని అందుకుంటారు. క్షేమ సమాచారాలను తెలుసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఏర్పడిన ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆరోగ్య స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెద్దగా ఇబ్బందులుండవు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
Next Story