Wed Dec 25 2024 17:26:05 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 17 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది కరంగా ఉంటాయి. ఎదుటివారు అపార్థం చేసుకునే..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్రవారం
తిథి : బ. ద్వాదశి రా.11.36 వరకు
నక్షత్రం : పూర్వాషాఢ రా.8.28 వరకు
వర్జ్యం : ఉ.7.31 నుండి 8.57 వరకు, తె.3.33 నుండి 4.58 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.54 నుండి 9.58 వరకు, మ.12.45 నుండి 1.31 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధికంగా ఉన్నా.. ఉపకరిస్తాయి. వాస్తు పరిశీలనలతో అనుకూల ఫలితాలుంటాయి. ఎదుటివారిని మెప్పించే ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అన్ని విధిలా జాగ్రత్తగా ఉండాలి. కీడెంచి మేలెంచాలన్న చందంగా ఉంటారు. ఎదుటివారిని అపార్థం చేసుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు, ఆర్థిక లావాదేవీలు ఊరటనిస్తాయి. ఎదుటివారితో కొత్తపరిచయాలకు, పాత పరిచయాలను బలపరచుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రోజంతా ఆనందంగా, ఉత్సాహంగా కొనసాగుతుంది. వాహన యోగం ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అంచనాల మేరకు సజావుగా ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తిడులు ఉన్నా వాటిని తట్టుకుని నిలబడతారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. రహస్యాలను తెలుసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అధిక జాగ్రత్తలు అవసరం. అనవరసమైన తగాదాలు, వివాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పులివ్వడం, తీసుకోవడానికి ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. ఏ పని చేయాలన్నా ఒకటి రెండుసార్లు చూసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది కరంగా ఉంటాయి. ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ. తెలియని ఆందోళన, అలజడి ఎక్కువగా ఉంటాయి. వాహన యోగం ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఎదుటివారు గౌరవిస్తారు. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఇంటర్వ్యూలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఫలితాలు అంతంతమాత్రంగా ఉంటాయి. పేరు, ప్రఖ్యాతులకు ఇబ్బందులుండవు. లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక పరమైన విషయాలు సాధారణంగా ఉంటాయి. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కొత్తవిషయాలు తెలుసుకోవాలన్న ఆకాంక్ష పెరుగుతుంది. చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఖర్చులు అధికమవుతాయి. శ్రమ ఎక్కువగా, ఫలితాలు తక్కువగా ఉంటాయి. విద్యార్థినీ, విద్యార్థులు అధికంగా శ్రమించాలి. కీలకమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూల ఫలితాలుంటాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరికీ అనుకూలమైన కాలం. అపార్థాలు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. కెరియర్ పై దృష్టిసారిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
Next Story