Thu Dec 26 2024 05:25:05 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 1 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, బుధవారం
తిథి : శు.ఏకాదశి మ.2.01 వరకు
నక్షత్రం : మృగశిర తె.3.23 వరకు
వర్జ్యం : ఉ.6.54 నుండి 8.00 వరకు
దుర్ముహూర్తం : మ.12.00 నుండి 1.30 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.00 నుండి 10.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీసుకోవడం, ఇవ్వడానికి దూరంగా ఉండాలి. కాంట్రాక్ట్, వ్యవసాయ రంగాల్లో ఉండేవారు తగుజాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు సానుకూలంగా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. స్థల కొనుగోళ్లలో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు. ఉద్యోగాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మందగించే సూచనలున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. పార్ట్ నర్ షిప్ వ్యాపారస్తులకు అనుకూలం. ఉదరసంబంధమైన అనారోగ్య సూచనలున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఊహించని ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. పనివేళలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. శుభకార్యాలు ముందుకు సాగుతాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మానసికంగా ఆనందాన్నిచ్చే సంఘటనలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంది. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య తగాదాలు, విబేధాలు సమసిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సమస్యలు పెరుగుతాయి. నిర్లక్ష్యమే సమస్యగా మారే సూచనలున్నాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. వాహన ప్రమాదాలు జరగవచ్చు. మాట్లాడేటపుడు ఆచితూచి వ్యవహరించాలి. అన్ని రంగాలు, వృత్తుల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాలపై శ్రద్ధ పెడతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలపై దృష్టి సారిస్తారు. వాహన యోగం ఉంది. మానసిక ఒత్తిడి ఉన్నా.. పనులు వేగంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక పరమైన చర్చలు కలసివస్తాయి. పెట్టుబడులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్న ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి అవకాశం లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రశాంతతను కోల్పోతారు. ప్రతివిషయంలోనూ తగాదా పడాల్సి ఉంటుంది. తప్పు లేకపోయినా.. మాట పడతారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story