Wed Dec 25 2024 17:40:24 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 20 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. నా అనుకున్న వారితోనే మాట..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, సోమవారం
తిథి : అమావాస్య మ.12.35 వరకు
నక్షత్రం : ధనిష్ఠ మ.11.46 వరకు
వర్జ్యం : సా. 6.08 నుండి 7.33 వరకు
దుర్ముహూర్తం : మ.12.44 నుండి 1.31 వరకు, మ.3.03 నుండి 3.49 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని రచిస్తారు. దృష్టిదోషం తగ్గుతుంది. అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడి అధికంగా ఉంటుంది. రోజంతా కలసివస్తుంది. స్వయంకృతాపరాధం లేనంతవరకూ ఏ విషయంలోనూ ఇబ్బందులు ఉండవు. ఎవరు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకుని తగు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసుకుంటారు. ముక్కుసూటితనం పనికిరాదు. స్నేహాలు ఉపకరిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రతికూలమైన కాలంలో అనుకూల ఫలితాలను పొందేందుకు కష్టపడతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ తో కూడిన పనులు చేయకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అంచనాలు నెరవేరుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఎదుటివారిని అంచనా వేస్తారు. దృష్టిదోషం తగ్గుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలుంటాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. నా అనుకున్న వారితోనే మాట పట్టింపులు ఏర్పడుతాయి. కారణం లేకపోయినా రోజంతా చికాకుగా గడుస్తుంది. వృథా ఖర్చులు చోటుచేసుకుంటాయి. ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది. ఏ విషయాన్ని ఎవరితోనే చర్చించకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనీ స్తబ్దుగా ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. ఆర్థిక, ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఊహాగానాలకు దూరంగా ఉండాలి. కాంట్రాక్ట్ రంగం వారికి అనుకూలంగా ఉండదు. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తీరని సమస్యలపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిస్పృహ దరిచేరనీయకపోవడం మంచిది. పెట్టుబడుల్లో మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మాటలు వివాదాస్పదమవ్వచ్చు. అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక, శారీరక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సహకరించే వర్గం చేరువలో ఉంటారు. ఆర్థికంగా లాభనష్టాలు ఉండవు. ఆలోచన పెరుగుతుంది. పనులు ఆలోచనలకే పరిమితమవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా సాగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. దంపతుల మధ్య తగాదాు పరిష్కారమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story