Wed Dec 25 2024 17:26:45 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 21 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. వాహనయోగం ఉంటుంది.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, మంగళ వారం
తిథి : శు.పాడ్యమి ఉ.9.04 వరకు, శు. విదియ రేపటి తె.5.57 వరకు
నక్షత్రం : శతభిష ఉ.9.00 వరకు
వర్జ్యం : మ.2.46 నుండి 4.13 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.53 నుండి 9.39 వరకు, రా.11.06 నుండి 11.56 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.12.50 నుండి 1.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వివాదాస్పద అంశాల నుంచి బయటపడుతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మాటమీద ఆధారపడి ఉన్నవారికి మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల పరంగా ఒత్తిడి పెరుగుతుంది. నూతన ఆలోచనలు చేసేవారికి కొత్త అవకాశాలు కలసివస్తాయి. వ్యాయామంపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల ఫలితాలుంటాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. సినీ, కళారంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వ్యతిరేక ఫలితాలుంటాయి. రిస్క్ లేని పనులను మాత్రమే పూర్తిచేసుకోవడం మంచిది. మంచికిపోతే చెడు ఎదురవుతుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. శుభవార్తల్ని వింటారు. ప్రేమలు ఫలిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. రోజంతా అంచనాల మేరకు సాగుతుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఫైనాన్స్ సెక్టార్ లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. విదేశీయాన ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలపై అధిక శ్రద్ధ చూపుతారు. ఎవరు ఎలా ఉన్నారనే దానికన్నా మీరు ధర్మబద్ధంగా ఉన్నారా ? లేదా ? అని చూసుకుంటారు. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. వాహనయోగం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పనులు వాయిదా ధోరణిలో కొనసాగుతాయి. ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ కు ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. ఎదుటివారి నుంచి సహాయం పొందుతారు. పెండింగ్ పనులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎంత తక్కువగా మాట్లాడితే అంతమంచిది. అపార్థాలు చోటుచేసుకుంటాయి. జాగ్రత్తగా మెలగాలి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కోపిష్టులుగా వ్యవహరిస్తారు. శత్రుబలం తగ్గుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తలు అవసరం. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువ. క్రయవిక్రయాలపై దృష్టి సారించేటపుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు వాయిదా వేయడంతో ఇబ్బంది పడతారు. పనివేళలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story