Wed Dec 25 2024 18:05:48 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 23 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అపార్థాలు చోటు చేసుకుంటాయి. ప్రతి విషయంలో కీడెంచి మేలెంచాలన్న చందంగా..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, గురువారం
తిథి : శు.చవితి రా.1.33 వరకు
నక్షత్రం : రేవతి తె.3.44 వరకు
వర్జ్యం : సా.4.17 నుండి 5.49 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.25 నుండి 11.11 వరకు, మ.3.03 నుండి 3.50 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.4.00 నుండి 5.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. శ్రమ ఎక్కువగా ఉంటంది. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు కీలక నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శారీరక, మానసిక స్థితి బాగుంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉత్సాహంగా ఉంటారు. ప్రతిపనిలోనూ సహకరించే వర్గం చేరువలో ఉంటుంది. గడిచిన కాలంలో జరిగిన సంఘటనలు మరిచిపోయేలా కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మాసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఉపయోగకరమైన ఖర్చులుంటాయి. వేళకు నిద్రాహారాలు పొందుతారు. సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అపార్థాలు చోటుచేసుకుంటాయి. ప్రతి విషయంలో కీడెంచి మేలెంచాలన్న చందంగా వ్యవహరిస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. పనులు వాయిదా పడుతుంటాయి. ప్రతివిషయంలో ఎదురుదెబ్బ తగులుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సౌకర్యాలు సమకూరుతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బాల్య స్నేహితులతో మాట్లాడటం వల్ల ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమలు ఫలిస్తాయి. శుభకార్యాలు ముందుకు సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. సంఘ గౌరవం లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఇంటర్వ్యూలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. తగాదా, వివాదం లేకుండా రోజు పూర్తికాదు. పనివేళలు పెరుగుతాయి. అన్నీ బాగున్నా పనుల్లో కదలిక లేక నిరుత్సాహపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. వేళకు నిద్రాహారాలు ఉండవు. మనసొక చోట మనిషి మరోచోట అన్నట్టుగా ఉంటారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. అందరితో పోల్చుకుని కుంగిపోతారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయ విక్రయాల అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వేళకు నిద్రాహారాలు కలిగి ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతారు. ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచుకోవాలి. శత్రువులెవరో, మిత్రులెవరో తెలియక సతమతమవుతారు. న్యాయవాద, రాజకీయ, కళా, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల వాతావరణం ఉంటుంది. అప్పులు తీర్చేందుకు గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలు సానుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story