Wed Dec 25 2024 06:42:56 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 24 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా, బంధువులతో..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్రవారం
తిథి : శు.పంచమి రా.12.31 వరకు
నక్షత్రం : అశ్విని తె.3.27 వరకు
వర్జ్యం : రా.11.29 నుండి 1.04 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.52 నుండి 9.38 వరకు, మ.12.44 నుండి 1.30 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.1.45 నుండి 2.30 వరకు, సా.5.50 నుంచి 6.20 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఒత్తిడులను అధిగమిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బందులుండవు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఊహించని ఖర్చులుంటాయి. అన్నివిషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి.గౌరవ, మర్యాదలు తగ్గుతాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. రోజంతా ఆహ్లాదంగా గడుపుతారు. నచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. సానుకూల ఫలతాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు పూర్తవుతాయి కానీ ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. దృష్టిదోషం పెరుగుతుంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రశాంతత లోపిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలు ఊరటనిస్తాయి. ఎదుటివారితో మాట్లాడేటపుడు జాగ్రత్త పడాలి. పని ఒత్తిడి పెరుగుతుంది. తగాదాలు సమసిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవసరమైన వివాదాలు చోటుచేసుకుంటాయి. అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. రిస్క్ కి ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా, బంధువులతో, ప్రయాణాల్లో, శుభకార్యాల్లో ప్రతి విషయంలోనూ విజయం పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఎదుటివారికి మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. ప్రేమలు ఫలిస్తాయి. ఉద్యోగం, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఖర్చులు ఉపకరిస్తాయి. నిద్రాహారాలు వేళకు అందుతాయి. పరిచయాలు పెరుగుతాయి. సంఘగౌరవం పొందుతారు. తగాదాలు, విభేదాలు తప్పకపోవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. మందులు వాడుతున్నా ఉపశమనం ఉండదు. ఊహించిన దానికంటే ఇబ్బందులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాల అంశాలు కలసివస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రుణ బాధలు తొలగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. నూతన పెట్టుబడులు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయ. గౌరవ, మర్యాదలకు లోటుండదు. తెలియని ఆందోళన వెంటాడుతుది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచించాలి. శారీరక అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story